టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని( Nani ) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.సినిమా హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు నాని.
ఇకపోతే నాని చివరగా దసరా, హాయ్ నాన్న,సరిపోదా శనివారం వంటి మూవీలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలు విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి.
ఇలా ఏడాదిన్నర గ్యాప్ లోనే మూడు విభిన్న సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు నాని.ఇకపోతే ఈ ఏడాది హిట్ 3( Hit 3 ) సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు.

ఈ మూవీ సమ్మర్ లో విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది.ఇకపోతే హీరో నాని కి ఒక సినిమా విడుదల కాగానే వెంటనే మరో సినిమాను మొదలుపెట్టడం అలవాటు.ఈ సారి కూడా అలాగే ప్లాన్ చేసుకున్నప్పటికీ తాను ఓకే చేసిన చిత్రాన్ని డైరెక్ట్ చేయాల్సిన వ్యక్తి సందిగ్ధంలో ఉండడం వల్ల అది వెంటనే పట్టాలెక్కే పరిస్థితి లేదు.హిట్-3 సినిమా తర్వాత సుజీత్( Sujeeth ) దర్శకత్వంలో సినిమాను ఓకే చేశాడు నాని.కానీ అతను ఓజీ( OG Movie ) సినిమాను పూర్తిచేయాల్సి ఉంది.అది పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది.కానీ పవన్ ఇంకా హరిహర వీరమల్లు సినిమానే పూర్తి చేయలేదు.

అది అయ్యాకే ఓజీ పని మొదలు పెడతాడు.కాబట్టి సుజీత్ ఖాళీ అవ్వడానికి సమయం పడుతుంది.ఈ లోపు నాని ప్యారడైజ్( Paradise Movie ) పూర్తి చేయనున్నాడట.
ఇదిలా ఉంటే నాని-సుజీత్ సినిమాను నిర్మించాల్సిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్( DVV Entertainments ) ఆ మూవీ నుంచి తప్పుకుందట.కారణాలు తెలియదు.ఆ స్థానంలో వెంకట్ బొళ్ళినేని లైన్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది.ఈ సినిమాను తన బేనర్లో చేస్తానని.
అందుకోసం ఎన్నిరోజులైనా వెయిట్ చేస్తానని ఆయన అంటున్నారట.







