విడుదలైన గ్రూప్-1 పరీక్ష ఫలితాలు.. మరి మీ రిజల్ట్ ఏంటి?

ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలపై( Government Jobs ) యువతలో విపరీతమైన ఆసక్తి పెరిగింది.ఉద్యోగ భద్రత, ఆకర్షణీయమైన వేతనం, సుస్థిర భవిష్యత్ వంటి అనేక కారణాలతో ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఆకర్షితులు అవుతున్నారు.

 Breaking News Tgpsc Group 1 Results Released In Telangana Details, Tspsc, Telang-TeluguStop.com

ముఖ్యంగా గ్రూప్ పరీక్షలు వలన ఉన్నత పదవులను సాధించవచ్చని భావిస్తూ గ్రూప్-1, గ్రూప్-2 వంటి పరీక్షలకు యువత పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు.

ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్( TSPSC ) గ్రూప్-1 పరీక్షల ఫలితాలను( Group-1 Results ) విడుదల చేసింది.గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన ప్రొవిజినల్ మార్కులను టీఎస్‌పీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి మార్కులను పరిశీలించవచ్చు.రీకౌంటింగ్ కోసం ఈనెల 24 వరకు అవకాశం కల్పించిన టీఎస్‌పీఎస్సీ, రూ.1000 చెల్లించి రీకౌంటింగ్‌కి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

Telugu Tspsc, Exam, Jobs, Exams, Public, Telangana, Tgpsc, Transparency, Interes

మార్చి 10 నుండి 18 వరకు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాలను ప్రకటించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.మార్చి 10న గ్రూప్-1 ఫలితాలు, 11న గ్రూప్-2 జనరల్ ర్యాంకింగ్ జాబితా, 14న గ్రూప్-3 ఫలితాలను వెల్లడించనుంది.అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలను మార్చి 17న, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను మార్చి 19న విడుదల చేయనుంది.ఇది ఇలా ఉండగా గ్రూప్-1 పోస్టులపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయని, ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అభ్యర్థులకు అధికారులు సూచించారు.

Telugu Tspsc, Exam, Jobs, Exams, Public, Telangana, Tgpsc, Transparency, Interes

గ్రూప్-1 మార్కుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే చూసుకోవాలని స్పష్టం చేసింది.నియామక ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందని, ఎలాంటి తప్పులు జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామని వెల్లడించింది.ప్రభుత్వ ఉద్యోగాలపై ఉన్న ఆసక్తి యువతను సానుకూల దిశలో నడిపిస్తుంది.టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ పరీక్షలు, పారదర్శక నియామక ప్రక్రియతో యువతకు మరింత నమ్మకం కలిగిస్తోంది.ఇలాంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవడం ద్వారా యువత తమ జీవితాల్లో సుస్థిరత సాధించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube