వింట‌ర్‌లో `ఉల్లికాడల` సూప్‌ తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

వింట‌ర్ సీజ‌న్ ప్రారంభం అయింది.ఈ సీజ‌న్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌నుకుంటే త‌ప్ప‌ని స‌రిగా డైట్‌లో కొన్ని కొన్ని ఆహారాల‌ను చేర్చుకోవాలి.

 Wonderful Benefits Of Spring Onion Soup! Health, Health Tips, Good Health, Benef-TeluguStop.com

అటువంటి వాటిల్లో ఉల్లి కాడ‌లు(స్ప్రింగ్ ఆయిన్స్‌) ఒక‌టి.ఉల్లి గ‌డ్డ‌ల‌ మాదిరిగానే ఉల్లి కాడ‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా ఈ వింట‌ర్ సీజ‌న్‌లో ఉల్లి కాడ‌ల సూప్‌ను త‌ర‌చూ తీసుకుంటే గ‌నుక ఎన్నో ఆరోగ్య లాభాల‌ను పొందొచ్చు.మ‌రి ఉల్లి కాడ‌ల‌తో సూప్‌ను ఎలా త‌యారు చేయాలి.? అస‌లు ఉల్లి కాడ‌ల సూప్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే బెనిఫిట్స్ ఏంటీ.? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లి కాడ‌ల సూప్ ఎలా త‌యారు చేసుకోవాలంటే.ముందుగా స్ట‌వ్‌పై గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసి ఒక స్పూన్ వెల్లుల్లి ముక్క‌ల‌ను వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక క‌ప్పు శుభ్రం చేసుకున్న ఉల్లి కాడ‌ల ముక్క‌లు వేసి స్లో ఫ్లేమ్‌పై లైట్‌గా ఫ్రై చేసుకోవాలి.ఆపై అందులో అర క‌ప్పు ఉడికించుకుని స్మాష్ చేసుకున్న బంగాళ‌దుంప, రెండు గ్లాసుల నీళ్లు, స‌రిప‌డా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, అర స్పూన్ సోయా సాస్‌, చిటికెడు ఆరిగానో వేసి బాగా ఉడికించుకుంటే సూప్ సిద్ధ‌మైన‌ట్టే.

ఈ ఉల్లి కాడ‌ల సూప్‌ను వింట‌ర్‌లో త‌ర‌చూ తీసుకుంటే గ‌నుక‌.ఇమ్యూనిటీ సిస్థ‌మ్ బ‌ల‌ప‌డి జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి సీజ‌న‌ల్ వ్యాధులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

అలాగే ఉల్లి కాడ‌ల సూప్‌ను డైట్‌లో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ త‌గ్గ‌డంతో పాటుగా ర‌క్త పోటు స్థాయిలు అదుపు త‌ప్ప‌కుండా కూడా ఉంటాయి.ఫ‌లితంగా గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

Telugu Benefits Soup, Tips, Soup-Telugu Health - తెలుగు హెల్

అధిక బ‌రువుతో ఇబ్బంది ప‌డే వారు ఉల్లి కాడ‌ల సూప్‌ను రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే.వేగంగా వెయిట్ లాస్ అవుతారు.క్యాన్సర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.కీళ్ళనొప్పుల నుంచి విముక్తి ల‌భిస్తుంది.కంటి చూపు మెరుగు ప‌డుతుంది.మ‌రియు జీవ‌క్రియ సైతం చురుగ్గా మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube