బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్( Anchor Rashmi Gautam ) గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో ఢీ, జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
వీటితోపాటు అప్పుడప్పుడు పండుగ ఈవెంట్లకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది.ఒకవైపు యాంకర్ గా అలరిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
అలాగే తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇకపోతే రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు అన్న విషయం మనందరికీ తెలిసిందే.జంతువుల పట్ల ఆమె చాలా దయ ప్రేమను కలిగి ఉంటారు.ముఖ్యంగా శునకాలు( Dogs ) అంటే ఆమెకు చాలా పిచ్చి ప్రేమ.
ఎవరైనా వాడికి ఇబ్బంది పెడుతున్నట్టు కనిపించిన రంగంలోకి దిగి వాళ్లతో వాదిస్తూ ఉంటుంది.సోషల్ మీడియా వేదికగా అలాంటి వీడియోలు వైరల్ అయినప్పుడు వెంటనే వాటిపై స్పందిస్తూ ఉంటుంది రష్మి.
ఏ మూగ జీవానికి హాని జరిగినా కూడా అస్సలు ఊరుకోదు.అలాంటి రష్మీ దగ్గర ఒకప్పుడు చుట్కి అనే పెట్ డాగ్( Pet Dog Chutki ) ఉండేది అన్న విషయం తెలిసిందే.
ఆ చుట్కీ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ వచ్చేది రష్మీ.

దాంతో చేసిన అల్లరి మొత్తాన్ని కూడా రష్మీ ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసేది.అయితే అది కొంతకాలం క్రితం చనిపోయింది.అదే విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్టు కూడా షేర్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఆ పెట్ డాగ్ అస్థికలను తాజాగా గోదావరి నదిలో కలిపింది రష్మీ.ఈ మేరకు సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోని విడుదల చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.
ఒక జీవిత కాలం పాటు నీ ప్రేమను నేను మిస్ అవుతూనే ఉంటాను.పునర్జన్మ అనేది ఉంటే గనక ఎలాంటి బాధా లేకుండా పుట్టాలని కోరుకుంటున్నాను.నీ విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినందుకు నన్ను క్షమించు.ఇక ప్రశాంతంగా మరో లోకానికి వేళ్ళు.
చుట్కి గౌతమ్ అంటూ ఒక హార్ట్ టచింగ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది రష్మీ.







