నందమూరి హీరో బాలకృష్ణ( Nandamuri hero Balakrishna ) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2( Akhand 2 ).ఈ సినిమా గతంలో విడుదల అయిన అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్న బాలయ్య బాబు ఇటీవల అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సినిమాలతో బాలయ్య బాక్సాఫీసుని హడలెత్తించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం పవర్ ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటితో ( Director Boyapati )అఖండ 2 తాండవం చేస్తున్నారు.
ఈ చిత్ర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తోంది.

కాగా బాలయ్య గత చిత్రం డాకు మహారాజ్ థియేటర్స్( Daku Maharaj Theatres ) కన్నా ఓటీటీ లోనే ఎక్కువ సెన్సేషన్ ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.నెట్ ఫ్లిక్స్ లో డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది.దానితో బాలయ్య,బోయపాటి అఖండ 2 పై ప్రముఖ ఓటీటీ సంస్థలు కన్నేశాయి.
డాకు మహారాజ్ కన్నడ, తమిళ, హిందీ వెర్షన్స్ కలిపి 60 కోట్ల మేర ఓటీటీ డీల్ జరిగినట్టుగా తెలుస్తోంది.ఇప్పుడు అఖండ 2 కి పాన్ ఇండియాలోని పలు బాషల్లో దాదాపుగా 80 కోట్ల రికార్డ్ ప్రైస్ ని ప్రముఖ ఓటీటీ సంస్థలు కోట్ చేసి అఖండ 2 డిజిటల్ హక్కుల కోసం పోటీపడుతున్నట్లుగా టాక్ ఉంది.

200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అఖండ 2కి ఈ మేర ఓటీటీ ( OTT )డీల్ సెట్ అయితే సగం బడ్జెట్ నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే కవర్ అవుతాయని చెబుతున్నారు.అయితే అఖండ 2 సినిమా ఈ సినిమాలన్నిటికంటే మంచి విజయం సాధిస్తుందని అభిమానులు మూవీ మేకర్స్ భావిస్తున్నారు.అఖండ సినిమాకి మించి అఖండ 2 సినిమా ఉంటుంది అని తెలుస్తోంది.ఈ సినిమాను దసరా పండుగ కానుకగా విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే.







