రష్యాలోని( Russia ) ఓ స్కూల్లో ఊహించని సీన్ చోటు చేసుకుంది.62 ఏళ్ల రజీఫ్ నుర్గాలీవ్ ( Razif Nurgaliev )అనే ఫిజిక్స్ టీచర్ క్లాస్‌రూమ్‌లో పోర్న్ చూస్తూ దొరికిపోయాడు.అది కూడా ఎక్కడో కాదు, ఏకంగా బోర్డు మీద డిస్‌ప్లే అవ్వడంతో స్టూడెంట్స్ షాక్ తిన్నారు.ఈ ఘటన బాష్కోర్టోస్టాన్‌లోని నెఫ్టెకామ్స్క్ నగర సమీపంలోని టాష్కినోవో గ్రామంలో జరిగింది.13, 14 ఏళ్ల వయసున్న విద్యార్థులు ఆ టీచర్ ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసిన మెయిన్ స్క్రీన్‌పై అశ్లీల కంటెంట్ చూసి అవాక్కయ్యారు.

అసలేం జరుగుతుందో అర్థం కాక చాలామంది స్టూడెంట్స్ వెంటనే ఫోన్లు తీసి వీడియోలు తీశారు. కొందరు మాత్రం ఏం జరుగుతుందో పట్టించుకోకుండా సైలెంట్‌గా ఉండిపోయారు.అంతే, ఈ వీడియోలు క్షణాల్లో రష్యాలో వైరల్ అయిపోయాయి.
పేరెంట్స్, ప్రజలు మండిపడుతున్నారు.కానీ స్కూల్ యాజమాన్యం మాత్రం ఇంకా ఈ విషయంపై స్పందించలేదు.
టీచర్‌ను సస్పెండ్ కూడా చేయలేదు.పేరెంట్స్ ఎంత గొడవ చేసినా స్కూల్ ప్రిన్సిపల్ రుడాన్యా బుర్ఖానోవా మాత్రం టీచర్‌పై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పడం విడ్డూరంగా ఉంది.
రజీఫ్ నుర్గాలీవ్ దాదాపు 40 ఏళ్లుగా స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారని, ఇంతకుముందు ఆయనపై ఎలాంటి కంప్లైంట్స్ లేవని చెప్పడం గమనార్హం.

“మేం ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం” అని ప్రిన్సిపల్ బుర్ఖానోవా తెలిపారు.స్టూడెంట్స్, పేరెంట్స్‌తో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నానని చెప్పారు.టీచర్‌ను సస్పెండ్ చేశారనే వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు.ఆ రోజు టీచర్ క్లాసులు అయిపోయాయని, మరుసటి రోజు స్కూల్‌కు హాలిడే కావడంతో వెంటనే సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదని సమర్థించుకున్నారు.”ఇరువైపుల వాదనలు వినాలి కదా.అందుకే టీచర్‌తో కూడా మాట్లాడాలి.అన్నీ తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకుంటాను” అని ఆమె అన్నారు.
ప్రస్తుతానికి విచారణ తర్వాత తీసుకునే చర్యలపైనే అందరి దృష్టి ఉంది.మరిన్ని వివరాలు తెలిస్తే తప్పకుండా అప్‌డేట్ చేస్తాం.








