ప్రస్తుతం చలికాలం( Winter ) కొనసాగుతోంది.ఈ చలికాలంలో పిల్లలు పుడితే వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి.
ముఖ్యంగా వారి ఆరోగ్యం విషయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.అప్పుడే చలికాలంలో వచ్చే వ్యాధుల నుంచి వారిని రక్షించగలుగుతారు.
చంటి పిల్లల దగ్గర పరిశుభ్రత పాటించడం ఎంతో ముఖ్యం.పరిశుభ్రత లేకపోతే రోగాలు త్వరగా వ్యాపిస్తాయి.
చంటి పిల్లలు ఉన్నచోట చుట్టూ పరిశ్రరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.తడి దుస్తులు పిల్లల దగ్గర ఉంచకూడదు.

అలాగే చలికాలంలో శిశువుకు వెచ్చని నీటిలో స్నానం చేయించాలి.అది కూడా రెగ్యులర్ గా కాదు.ఒక రోజు స్నానం చేయిస్తే.మరొక రోజు తడి టవల్ తో శిశువు శరీరాన్ని క్లీన్ చేయవచ్చు.పిల్లల పాదాలకు సాక్స్, చేతులకు గ్లౌస్, చెవులు కవర్ అయ్యేలా తలకు టోపీ ధరించాలి.వింటర్ సీజన్ లో చంటి పిల్లలకు బాడీ మసాజ్ అనేది ఎంతో ఉత్సాహాన్ని అందిస్తుంది.
ముఖ్యంగా గోరువెచ్చని ఆయిల్ తో పిల్లలకు మసాజ్ చేయాలి.దీంతో రక్త ప్రసరణ( Blood circulation ) మెరుగుపడుతుంది.
పిల్లలు కూడా చాలా యాక్టివ్ గా అవుతారు.హాయిగా ఫీల్ అవుతారు.
చలి కాలం కాబట్టి పిల్లలకు ముక్కు తరచూ బ్లాక్ అవుతుంటుంది.కాబట్టి నాసల్ డ్రాప్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
చలికాలం కాబట్టి పిల్లలు రోజంతా ఇంట్లోనే ఉంచేస్తుంటారు.ఇలా చేయడం సరికాదు.
కనీసం పది నిమిషాలైనా ఎండలోకి తీసుకెళ్లాలి.

ఉదయం వచ్చే సూర్య రష్మి లో పిల్లలను కొద్దిసేపు ఉంచితే విటమిన్ డి( Vitamin D ) అందుతుంది.ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.దాంతో రోగుల దరి చేరకుండా ఉంటాయి.
ఇక చలి నుంచి రక్షణ కల్పించడానికి పిల్లలకు బరువైన దుప్పట్లు కప్పేస్తుంటార.దీని కారణంగా పిల్లలు అసౌకర్యానికి గురవుతుంటారు.
కాబట్టి వెచ్చగా ఉండేందుకు మంచి దుస్తులు వేయండి.బరువున్న దుప్పట్లు కాకుండా తేలికపాటివి కప్పండి.
తద్వారా వారు కాస్త ఫ్రీగా ఉండగలుగుతారు.