తన దూకుడైన నిర్ణయాలతో ప్రపంచానికి షాకులు ఇస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.( US President Donald Trump ) మిత్రులు, శత్రువులు అన్న తేడా లేకుండా సుంకాల యుద్ధం మొదలుపెట్టిన ఆయన ఇప్పటికే చైనా, కెనడా, మెక్సికో దేశాలపై భారీగా పన్నులు పెంచారు.
తాజాగా తన ఫోకస్ భారత్‌పై( India ) పెట్టారు.ఇండియా తమపై అధిక దిగుమతి సుంకాలను( High Import Duties ) విధిస్తోందని సాకుతో ఏప్రిల్ 2 నుంచి ఆ దేశంపై ప్రతీకార సుంకాలను అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు.
దీంతో ఇరుదేశాల్లోని ట్రేడ్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.

గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ట్రంప్ ఇలానే మనదేశంపై సుంకాలు పెంచారు.దీనిపై భగ్గుమన్న మోడీ సర్కార్ 2019లో దాదాపు 28 అమెరికన్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను విధించి షాకిచ్చింది.భారత్ నుంచి ముత్యాలు, రంగురాళ్లు, ఆహార ఉత్పత్తులు, ఔషధాలు అమెరికాకు ఎగుమతి అవుతాయి.
అమెరికా నుంచి విద్యుత్ పరికరాలు, అణు రియాక్టర్లు, ఖనిజ ఇంధనాలు, వైద్య పరికరాలు, మైక్రోస్కోపులు దిగుమతి అవుతాయి.అమెరికా పన్నుల పెంపు ప్రభావం భారత్‌లోని కొన్ని రంగాలపై పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్( Piyush Goyal ) ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు.

ఈ నేపథ్యంలో కొన్ని అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించాలని స్మాల్ ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారులు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.మార్చి 12 నుంచి అమల్లోకి రానున్న ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై 25 శాతం అమెరికా సుంకాలు భారతీయ ఎగుమతిదారుల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.జనవరిలో భారత్ నుంచి అమెరికాకు ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులు గతేడాదితో పోలిస్తే 18 శాతం పెరిగి 1.62 బిలియన్లకు చేరుకున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.సుంకాలు విధించే నాటికి ఈ రంగంలో వృద్ధి 7.44 శాతానికి పైగా ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.ఇలాంటి పరిస్ధితుల్లో ట్రంప్ సుంకాల కత్తి పరిశ్రమ వర్గాలను భయాందోళనకు గురిచేస్తోంది.







