నా కూతురు ఇలా చేస్తుందనుకోలేదు.. అదే చివరిసారి.. కర్ణాటక డీజీపీ కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్ రన్యారావు( Ranya Rao ) బంగారం అక్రమ రవాణా( Gold Smuggling ) విషయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు.

 Ranya Rao Married 4 Months Ago Not Visited Karnataka Dgp Details, Ranya Rao,gold-TeluguStop.com

ప్రస్తుతం ఇదే వార్త ఇండస్ట్రీలో కూడా మారింది.బంగారం అక్రమరవాణాతో అప్రతిష్ట మూటగట్టుకుంది కన్నడ హీరోయిన్‌ రన్యారావు.

దాదాపుగా 14 కిలో లకు పైగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆమెను బెంగళూరు విమానాశ్రయంలో( Bengaluru Airport ) సోమవారం అరెస్ట్‌ చేశారు.అయితే ఆమె డీజీపీ కూతురినని చెప్పడంతో పోలీసులు సైతం షాక్‌ అవాక్కయ్యారు.

Telugu Gold, Ranya Rao, Karnataka, Karnatakadgp, Ranyarao, Ranya Rao Gold-Movie

అయితే రన్యా రావుకు కర్ణాటక డీజీపీ డాక్టర్‌ కె రామచంద్రారావు( Karnataka DGP K Ramachandra Rao ) సొంత తండ్రి కాదు, సవతి తండ్రి అవుతాడట.ఈ విషయం కాస్త మరింత వైరల్ అవ్వడంతో తాజాగా ఈ ఘటనపై డీజీపీ కె రామచంద్రరావు స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.నాలుగు నెలల క్రితమే రన్యా పెళ్లి జరిగింది.అప్పటి నుంచి ఇప్పటి వరకు తను మమ్మల్ని కలవనేలేదు.తన గురించి కానీ, తన భర్త చేసే బిజినెస్‌ గురించి మాకేమీ తెలీదు.

జరిగిన విషయం తెలిసి మేమంతా షాకయ్యాము.అలాగే నిరాశచెందాము.

చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అన్నారు.

Telugu Gold, Ranya Rao, Karnataka, Karnatakadgp, Ranyarao, Ranya Rao Gold-Movie

ప్రస్తుతం రన్యాను మార్చి 18 వరకు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచనున్నారు.మరి ఈ విషయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.ఈమెను దర్శకుడు, హీరో సుదీప్‌ వెండితెరకు పరిచయం చేశాడు.ఆయన డైరెక్ట్‌ చేసిన మాణిక్య చిత్రంలో సహాయ నటిగా నటించింది.ఇది ప్రభాస్‌ మిర్చి మూవీకి రీమేక్‌ గా తెరకెక్కింది.గతంలో ఒక ఇంటర్వ్యూలో హీరో దర్శన్‌ తో కలిసి పని చేయాలనుందని తెలిపింది.తాను మంచి భోజన ప్రియురాలు అని, షాపింగ్‌ చేయడం అంటే ఇష్టమని పేర్కొంది.

పటాస్‌ కన్నడ రీమేక్‌ పటాకిలో హీరోయిన్‌ గా నటించింది.తమిళంలో వాఘా మూవీ చేసింది.

ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోందని ఆమె తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube