వైరల్ వీడియో.. అరెరే.. ఇక్కడ మహేష్ బాబు ఫైటింగ్ సీన్ ఉందా? చూడనే లేదు!

2013లో విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు( Seethamma Vakitlo Sirimalle Chettu ) చిత్రం మళ్లీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.వెంకటేశ్,( Venkatesh ) మహేష్ బాబులు( Mahesh Babu ) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందించారు.

 Seethamma Vakitlo Sirimalle Chettu Re Release Fans Eager To Relive Mahesh Babu A-TeluguStop.com

దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇప్పుడు, 12 ఏళ్ల తర్వాత మార్చి 7న ఈ సినిమా రీ రిలీజ్ అవుతోంది.

రీరిలీజ్ సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ, ప్రీ బుకింగ్స్‌లో ఇప్పటికే పది థియేటర్లు పూర్తిగా ఫుల్ అయ్యాయని ఆయన వెల్లడించారు.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఇప్పటికే టీవీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్లలో ఎన్నోసార్లు ప్రసారమైనప్పటికీ, సినిమాను మళ్లీ థియేటర్లో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

సోషల్ మీడియాలో అయితే ఈ సినిమా హడావిడి మామూలుగా లేదు.మహేష్, వెంకీ అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఇది ఇలా ఉండగా.ఈ సినిమాకు సంబంధించిన ఒక డిలీటెడ్ సీన్( Deleted Scene ) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో మహేష్ బాబు ఒక షాపింగ్ మాల్‌లో కూర్చొని ఉంటారు.అదే సమయంలో కొంతమంది కుర్రాళ్లు ఒక అమ్మాయిని తోసుకుంటూ పరిగెత్తుతారు.దీనిని చూసిన మహేష్, వారిలో ఒకరిపై చేయి చేసుకుంటారు.తరువాత మరికొందరిని కూడా కొడతారు.

ఈ సీన్‌ చూసిన నెటిజన్లు, “ఇది సినిమాలో ఎక్కడ పెట్టాలనుకున్నారు?” అని కామెంట్లు చేస్తున్నారు.మహేష్ బాబు ధరించిన కాస్ట్యూమ్స్ చూసి, సమంత తన ఫ్యామిలీకి మహేష్‌ను పరిచయం చేసే సీన్‌లో ఈ ఫైట్ సీన్ ప్లాన్ చేసినట్లు అర్థం అవుతోంది.

కానీ సినిమా లెంథ్ ఎక్కువై సీన్‌ను తొలగించారా అన్నది తెలియదు.

ఇటీవల, వెంకటేశ్‌కు సంబంధించిన ఒక సీన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇందులో బ్రహ్మాజీ సిటీ నుంచి వచ్చి వెంకటేశ్ ముందు బిల్డప్ కొడతాడు.అయితే, ఆ సీన్ కూడా ఫైనల్ వెర్షన్‌లో లేకపోవడం ఆసక్తికరంగా మారింది.

మీడియా ప్రతినిధులు రీ రీలీజ్‌ ప్రింట్‌కి ఎక్స్‌ట్రా ఫుటేజ్‌ యాడ్ చేస్తున్నారా అని అడగ్గా.దిల్ రాజు “లేదండి” అని క్లారిటీ ఇచ్చారు.“యాడ్ చేయాలనుకుంటే చాలా ఫుటేజ్ ఉంది.కానీ, అప్పుడు రిలీజ్ అయినప్పుడు సినిమా ఎలా ఉందో దానినే రీ రిలీజ్ చేస్తున్నాం” అని అన్నారు.

ఇలా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను మళ్లీ థియేటర్‌లో చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మళ్లీ ఈ కుటుంబ కథా చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలా స్పందన వస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube