హెయిర్ ఫాల్. స్త్రీ, పురుషుడు అనే తేడా లేకుండా కోట్లాది మందిని అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్య ఇది.
అయితే హెయిర్ ఫాల్ ను అడ్డుకునేందుకు కొందరు తరచూ తోచిన హెయిర్ ప్యాక్, మాస్కులు వేసుకుంటారు.కానీ కొందరికి మాత్రం హెయిర్ విషయంలో కేర్ తీసుకునేంత టైమ్ ఉండదు.
అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హెయిర్ టోనర్ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.వారంలో ఒక్కసారి ఈ హెయిర్ టోనర్ ను కనుక వాడితే జుట్టు రాలడాన్ని సులభంగా అడ్డుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ టోనర్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యే లోపు ఐదు నుంచి ఆరు జామ ఆకులు, నాలుగు రెబ్బల కరివేపాకును తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.ఇలా దంచుకున్న జామ ఆకులు మరియు కరివేపాకును వాటర్ లో వేసుకోవాలి.
నీరు సగం అయ్యేంత వరకు వాటర్ ను మరిగించాలి.ఆ తర్వాత స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో ఒక గ్రీన్ టీ బ్యాగ్ ను కనీసం ఐదు నిమిషాల పాటు డిప్ చేస్తూ ఉండాలి.తద్వారా మన హెయిర్ టోనర్ సిద్ధమవుతుంది.
ఈ హెయిర్ టోనర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ కు తయారు చేసుకున్న హెయిర్ టోనర్ ను ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.
రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారంలో ఒకే ఒక్కసారి ఈ హెయిర్ టోనర్ కనుక వాడితే జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి.దాంతో జుట్టు రాలడం క్రమంగా తగ్గుముఖం పడుతుంది.అలాగే ఈ హెయిర్ టోనర్ ను వాడటం వల్ల పలుచటి జుట్టు ఒత్తుగా మారుతుంది.పైగా ఈ హెయిర్ టోనర్ చుండ్రు సమస్యను వదిలించడానికి సైతం ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.