పది రోజుల్లో పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలంటే ఈ చిన్న చిట్కా చాలు

పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటే అసహ్యంగా కనపడటమే కాకుండా వేసుకొనే బట్టలు కూడా అందంగా ఉండవు.అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

 How To Lose Belly Fat-TeluguStop.com

అసలు పొట్ట రావటనికి గల కారణాలను కూడా అన్వేషిస్తే బిజీగా మరీనా జీవనశైలి తినే ఆహారంలో మార్పులు సరైన వ్యాయామం లేకపోవటం వంటి కారణాలు పొట్ట మీద ప్రభావం చూపటం వలన పొట్ట చుట్టూ కొవ్వు చేరి అసహ్యంగా కనపడుతుంది.ఈ పరిస్థితి నుండి బయట పడటానికి ప్రభావంతమైన చిట్కాలను వెతకటం ప్రారంభిస్తారు.

అటువంటి వారి కోసం మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

అల్లం:

మనం సాధారణంగా ప్రతి రోజు అల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటాం.అల్లంలో ఉన్న ఔషధ గుణాలు కొవ్వును వేగంగా కరిగిస్తాయి.

అల్లం ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది.అంతేకాక నడుము,పొట్ట,పిరుదుల భాగాలలో పేరుకుపోయిన కొవ్వును కరిగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

అల్లంలో ఉండే జింజిరాల్ అనే పదార్ధం శరీరంలో అధికంగా ఉన్న నీటిని బయటకు పంపటంతో ఆటోమేటిక్ గా కొవ్వు కూడా బయటకు పోతుంది.అల్లం ph స్థాయిలను స్థిరీకరించుట వలన జీర్ణక్రియ మెరుగు అవుతుంది.అంతేకాక జీర్ణక్రియ రేటును కూడా పెంచటంలో సహాయపడుట వలన బరువు తగ్గుతాం.

మరి కొవ్వు కరగటానికి అల్లంను ఎలా తీసుకోవాలో అని ఆలోచిస్తున్నారా? అల్లంను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.అల్లం నీటి రూపంలో తీసుకోవాలి.నీటిలో అల్లం ,ముక్కలు వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత ఆ నీటిని వడకట్టి నీటిని త్రాగాలి.ఈ అల్లం నీటిని మాములు నీరు త్రాగిన విధంగానే రోజంతా త్రాగుతూ ఉండాలి.ఈ విధంగా క్రమం తప్పకుండా మూడు నెలల పాటు త్రాగితే శరీరంలో అధికంగా పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది.

అయితే ముఖ్య విషయం ఏమిటంటే అల్లం నీటిని ప్రతి రోజు తాజాగా తయారుచేసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube