టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ఫుల్ జోష్ మీద ఉన్నారు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు కిరణ్ అబ్బవరం.
అందులో భాగంగానే ఇటీవలే క సినిమాతో( Ka Movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ని సాధించింది.
ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు కిరణ్ అబ్బవరం.

ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు.తాజాగా కిరణ్ నటిస్తున్న చిత్రం దిల్ రూబా.( Dilruba Movie ) విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇకపోతే సిక్స్ ప్యాక్( Six Pack ) అన్నది ఓల్డ్ ఫ్యాషన్.అయితే హీరో కిరణ్ అబ్బవరం కూడా ఇప్పుడు సిక్స్ ప్యాక్ అంటూ మోజుపడుతున్నారట.

రాజేష్ దండా నిర్మాతగా చేయబోయే సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేస్తానంటున్నారట.అక్కడితో ఆగకుండా లిప్ లాక్ కిస్ లు ఉండే సీన్లు సినిమా నిండా ఉండేలా చూసుకుంటున్నారని వార్తలు గుప్పుమన్నాయి.అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అవసరమా సిక్స్ ప్యాక్ లు, మూతి ముద్దులు అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ సమయంలో అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రూబా సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.ఈ మూవీ మార్చి 14న విడుదల కానుంది.







