అంటార్కిటికా( Antarctica ) అనేది మంచు దుప్పటి కప్పిన ఖండం.పింగ్విన్‌లు, సీల్స్‌తో నిండిన ప్రదేశం ఇది.అక్కడికి వెళ్లాలని ఎవరికి ఉండదు చెప్పండి, కానీ, లగ్జరీ లైఫ్‌స్టైల్ వెకేషన్స్( LLV ) అనే సంస్థ మాత్రం అంటార్కిటికా టూర్‌ను ఓ రేంజ్‌లో ప్లాన్ చేసింది.అదేంటంటే… అంటార్కిటికాలో ఏకంగా శృంగార యాత్ర. నమ్మశక్యంగా లేదు కదూ, కానీ ఇది నిజం.అయితే ఈ ట్రిప్ ఖర్చు పది లక్షలు మాత్రమే అని కంపెనీ చెబుతోంది.
సీబోర్న్( Seabourn ) అనే లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో ఈ యాత్ర ఉంటుందట.దక్షిణ అర్థగోళంలో వేసవి కాలంలో ఈ ట్రిప్ ప్లాన్ చేశారు.
ఇది మామూలు ట్రిప్ కాదు, ఏకంగా 12 రోజుల పాటు సాగే శృంగార యాత్ర.దాదాపు 250 జంటలు ఈ ట్రిప్‌లో పాల్గొంటారట.
అంతా “లైక్ మైండెడ్ కపుల్స్” అంట.అంటే ఇక చెప్పేదేముంది, పార్టనర్ స్వాపింగ్, థీమ్ పార్టీలు, శృంగార ప్రదర్శనలు, ఇలా చాలానే ఉన్నాయి.సెక్సీ ప్లేరూమ్ సెషన్స్, స్విమ్మింగ్ పూల్, జకుజీ పార్టీలు, లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ ఉంటాయట.బోర్ కొట్టకుండా ఉండటానికి సెమినార్లు, డీజే నైట్స్, మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్స్ కూడా ఏర్పాటు చేశారట.

అడ్వెంచర్ కోరుకునేవాళ్ల కోసం కూడా ఇందులో చాలా ఉన్నాయి.వేల్స్, పెంగ్విన్స్ చూడటానికి డే టైమ్ ఎక్స్‌కర్షన్స్ కూడా ఉంటాయట.లగ్జరీ ఫెసిలిటీస్ గురించి చెప్పాల్సిన పనిలేదు, స్పా, వెల్‌నెస్ సెంటర్, అదిరిపోయే ఫుడ్ అన్నీ రెడీగా ఉంటాయ్.క్రూయిజ్‌లో ఏకంగా ఎనిమిది రెస్టారెంట్లు, ఎనిమిది బార్లు ఉన్నాయంటే ఊహించుకోండి.
ఇన్ఫినిటీ పూల్, నాలుగు ఔట్‌డోర్ విర్ల్‌పూల్స్, లైబ్రరీ, రెండు సబ్‌మెరైన్‌లు, కయాక్స్ ఇలా లిస్ట్ చాలా పెద్దది.సూట్‌లలో అయితే వాక్-ఇన్ క్లోసెట్‌లు, ఫ్రీ ప్రీమియం డ్రింక్స్ కూడా ఇస్తారట.
లగ్జరీకి లగ్జరీ, మజాకి మజా.

“సెక్సీ అండ్ అన్‌ఫర్‌గెటబుల్” ఎక్స్‌పీరియన్స్ ఉంటుందని LLV వాళ్లు గట్టిగా చెబుతున్నారు.దాంతో, టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.ఎప్పుడో సోల్డ్ ఔట్ కూడా అయిపోయాయ్.
అయితే, ఈ ట్రిప్‌పై కొంచెం కాంట్రవర్సీ కూడా ఉంది.అంటార్కిటికా టూరిజం( Antarctica Tourism ) అంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి.
ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలి కదా.ఇలాంటి ట్రిప్‌ల వల్ల వైల్డ్‌లైఫ్‌కి ఇబ్బంది కలుగుతుందని, పొల్యూషన్ పెరుగుతుందని కొందరు ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.ఏదేమైనా, ఈ ట్రిప్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.







