చాలా కాలంగా వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న మంచు విష్ణు ( Manchu Vishnu )ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేసాడు.మంచు విష్ణు హీరోగా మోహన్ బాబు ఒక భక్తి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అదే “కన్నప్ప”( Kannappa ).కన్నప్ప తన డ్రీం ప్రాజెక్ట్ అని మంచు విష్ణు చాలా ఇంటర్వ్యూ లలో చెప్పడం మన విన్నాం.ఇప్పుడు ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది.గత నెల శ్రీకాళహస్తిలో పూజ కార్యక్రమం కూడా పూర్తి చేసారు మేకర్స్.ఆఫీసియల్ గా ఈ చిత్రాన్ని ఆగష్టు 18న లాంచ్ చేసారు.ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ ( 24 Frames Factory Banner )పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసారు మోహన్ బాబు.ఐతే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను ముందుకు నడిపించడం సాదా సీదా డైరెక్టర్ వల్ల కానీ పని.అందుకే మోహన్ బాబు ఒక ఎక్స్పర్ట్ ను రంగం లోకి దింపాడు.అతను ఇప్పటికే ఒక సూపర్ హిట్ ఎపిక్ సీరియల్ ను తెరకెక్కించాడు.
ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? అతను తెరకెక్కించిన ఆ సూపర్ హిట్ సీరియల్ ఏమిటి ? ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం.
మంచు మనోజ్ ( Manchu Manoj )కన్నప్ప చిత్రానికి దర్శకత్వం వహించబోయేది “ముకేశ్ కుమార్ సింగ్”( Mukesh Kumar Singh ).ఇతను బాలీవుడ్ కు చెందిన దర్శకుడు.ఈయన ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తియ్యలేదు.
ముకేశ్ కుమార్ సింగ్ స్వస్థలం బీహార్.బీహార్ లో పుట్టి పెరిగిన ముకేశ్ డ్రమాటిక్ ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు.
అందులో గోల్డ్ మెడల్ కూడా అందుకున్నాడు.తరువాత ఆయన ఆల్ ఇండియా రేడియో కి సంబంధించిన సౌండ్ అండ్ డ్రామా డివిజన్ అఫ్ ఇండియా లో ఎన్నో నాటకాల్లో నటించాడు.
కొన్ని నాటకాలకు దర్శకత్వం కూడా వహించాడు.ముకేశ్ దర్శకుడు కావాలనే ఆశతో 2000 లో ముంబైలో అడుగుపెట్టాడు.
మొదట్లో శ్రీ అధికారి బ్రదర్స్ తో కలిసి పనిచేసాడు.మొట్టమొదట “సురాగ్”( Suragh ) అనే టీవీ సిరీస్ కి దర్శకత్వం వహించే అవకాశం పొందాడు.
ఆ తరువాత ఎన్నో పౌరాణిక మరియు చారిత్రాత్మక టీవీ షో లకు దర్శకుడిగా పనిచేసాడు ముకేశ్.
మనందరికీ ఎంతగానో ఇష్టమైన షో, భారతదేశ టెలివిషన్ చరిత్రలో అతి పెద్ద షో “మహాభారతానికి” ఈయన దర్శకత్వం వహించాడు.ఈ టీవీ షో కు సుమారు 100 కోట్లు ఖర్చు అయ్యిందని సమాచారం.మహాభారతం తో పాటు రామాయణం, రజియా సుల్తానా, మేరె సాయి, హనుమాన్ వంటి సూపర్ హిట్ షోలకు దర్శకత్వం వహించిన ముకేశ్ కుమార్ సింగ్ ఇప్పుడు వెండి తెర పై తన ప్రతిభను చూపించడానికి మొదటిసారి తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెడుతున్నాడు.
మరి ఈ చిత్రం ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.