మనం పాలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము.చాలామంది ప్రతిరోజు పాలను( Milk ) తాగుతూ ఉంటారు.
పాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని దాదాపు చాలామందికి తెలుసు.దాదాపు మన శరీరానికి అవసరమయ్యే క్యాల్షియం, ప్రోటీన్స్, మెగ్నీషియం, విటమిన్ ఎ, రైబోఫ్లోవీన్, ఫాస్ఫరస్, విటమిన్ ఇ లాంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి.
పాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.అయితే సాధారణ పాలను తాగడానికి బదులుగా అందులో లవంగాల( Clove ) పొడిని కలిపి తీసుకోవడం వల్ల మరింత మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

లవంగాలు మనకు మసాలా దినుసులుగా మాత్రమే తెలుసు.కానీ లవంగాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.లవంగాలలో కూడా క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ లవంగాలను పొడి చేసి పాల లో కలిపి తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఇలా లవంగాల పొడి కలిపిన పాలను తీసుకోవడం వల్ల వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆస్తమా వంటి సమస్యల నుంచి చక్కని పరిష్కారం కలుగుతుంది.ఈ పాలను రాత్రిపూట తీసుకోవడం వల్ల ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు దూరమవుతాయి.
దీనితో పాటు నిద్రలేమి సమస్యలు( Insomnia ) కూడా దూరం అవుతాయి.

అలాగే పాలలో లవంగాల పొడి కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.ఆకలి కూడా పెరుగుతుంది.అలాగే ఈ పాలను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.ఇన్ఫెక్షన్లు మన దరిచేరకుండా ఉంటాయి.
అలాగే పాలలో లవంగం పొడి నీ కలిపి తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన, దంతాల నొప్పులు వంటి సమస్యలు దూరమవుతాయి.నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇటువంటి చక్కటి ప్రయోజనాలు పొందాలనుకునే వారు లవంగం పొడిని కలిపిన పాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.