ఇటీవల రోజుల్లో బరువు తగ్గడం కోసం ప్రయత్నించే వారి సంఖ్య భారీగా ఉంది.ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, శరీరానికి శ్రమ లేకపోవడం, హార్మోన్ చేంజెస్, పలు రకాల మందుల వాడకం, ప్రెగ్నెన్సీ, మద్యపానం తదితర కారణాల వల్ల వెయిట్ గెయిన్ అవుతుంటారు.
బరువు పెరిగితే రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టేస్తుంటాయి.దానికి తోడు శరీర ఆకృతి అందవిహీనంగా మారుతుంది.
అందుకే పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే టీ రోజుకు ఒక కప్పు చొప్పున ప్రతి రోజు తీసుకుంటే నెల రోజుల్లోనే నాజూగ్గా మారతారు.
మరి ఇంతకీ ఆ టీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఐదు నుంచి ఎనిమిది తులసి ఆకులను తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో తులసి ఆకులు, రెండు అనాస పువ్వులు మరియు కొద్దిగా డ్రై లెమన్ గ్రాస్ వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.

ఇలా మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని కొద్దిగా తేనెను మిక్స్ చేస్తే లెమన్ గ్రాస్ తులసి టీ సిద్ధం అవుతుంది.రోజుకు ఒక కప్పు చొప్పున ప్రతి రోజూ ఈ టీను తీసుకుంటే శరీరంలో క్యాలరీలు త్వరగా కరుగుతాయి.దీంతో వేగంగా బరువు తగ్గుతారు.అంతేకాదు ఈ టీ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.మెదడు పని తీరు మెరుగుపడుతుంది.ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.
మరియు వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.