బొప్పాయి తొక్కలతో మెరిసే చర్మం మీ సొంతం.. ఇంతకీ వాటిని ఎలా వాడాలంటే?

ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే పండ్లలో బొప్పాయి( papaya ) ఒకటి.రుచి పరంగానే కాదు పోషకాల పరంగా కూడా బొప్పాయికి మరొకటి సాటి లేదు.

 These Are The Amazing Skin Care Benefits Of Papaya Peel! Papaya Peel, Papaya Pee-TeluguStop.com

అనేక జబ్బులకు ఔషధంగా బొప్పాయి పండు పని చేస్తుంది.అయితే బొప్పాయి తినే క్రమంలో దాదాపు అందరూ తొక్కను తొలగించి డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.

బొప్పాయి తొక్క ఎందుకు పనికి రాద‌ని భావిస్తుంటారు.మీరు అలానే అనుకుంటున్నారా.

అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు తప్పకుండా తెలుసుకోండి.

బొప్పాయి పండు లోనే కాదు బొప్పాయి తొక్కలోనూ ఎన్నో పోషకాలు ఉంటాయి.

బొప్పాయి పండు తొక్కలు( Papaya peels ) మన చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.అందుకోసం బొప్పాయి పండు తొక్కను ఏ విధంగా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Latest, Papayapeel, Skin Care, Skin Care Tips, Skincare-Telugu Heal

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని ఫ్రెష్ బొప్పాయి పండు తొక్కలు మరియు నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ ( Rose water )వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ పెరుగు( curd ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని సున్నితంగా కనీసం రెండు నుంచి మూడు నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.

Telugu Tips, Latest, Papayapeel, Skin Care, Skin Care Tips, Skincare-Telugu Heal

మ‌సాజ్ అనంత‌రం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.బొప్పాయి పీల్ అనేక‌ ఎంజైమ్‌లు మరియు విటమిన్లతో నిండిన సహజమైన ఎక్స్‌ఫోలియేటర్.పైన చెప్పిన విధంగా బొప్పాయి తొక్కను ఉపయోగిస్తే చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.

టాన్ రిమూవ్ అవుతుంది.మొటిమలు ఏర్పడటానికి దారి తీసే నూనె మరియు ధూళి క్లియర్ అవుతుంది.

చర్మం య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మెరుస్తుంది.అలాగే బొప్పాయి పీల్ లో మాయిశ్చరైజింగ్ లక్షణాలు మెండుగా నిండి ఉంటాయి.

అందువల్ల ఇది చ‌ర్మాన్ని తేమ‌గా సైతం ఉంచుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube