రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదా.. ఉదయానికి చికాకుగా అనిపిస్తుందా.. అయితే ఇలా చేయండి!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ ఎంత బిజీగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.డబ్బు సంపాదనలో పడి చాలా మంది తినడం, నిద్రపోవడం కూడా మర్చిపోతున్నారు.

 Insomnia Problem Will Go Away By Taking This Powder! Insomnia, Insomnia Treatmen-TeluguStop.com

ముఖ్యంగా నిద్రను నిర్లక్ష్యం చేస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.రోజంతా ఆఫీసులో కష్టపడటం.

ఇంటికి వచ్చాక ఫోన్ తో కుస్తీ పడటం జనాలకు అలవాటైపోయింది.ఈ అలవాటు కారణంగా ఎంతో మంది నిద్రలేమి బారిన పడుతున్నారు.

దీని వల్ల ఎంత పడుకుందామని ప్రయత్నించినా కూడా కంటికి కునుకు రాదు.ఫలితంగా ఆరోగ్యం చెడిపోవడం ప్రారంభమవుతుంది.

రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోవడం( Insomnia ) వల్ల ఉదయానికి చికాకు గా అనిపిస్తుంది.ఒత్తిడి పెరుగుతుంది.పనిపై ఏకాగ్రత నెమ్మదిస్తుంది.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.

అందుకే కంటి నిండా నిద్రపోవాలని నిపుణులు పదే పదే చెబుతారు.ఇకపోతే నిద్రలేమిని వదిలించుకోవడానికి కొన్ని ఆహారాలు చాలా బాగా సహాయపడతాయి.

అందులో ఇప్పుడు చెప్పబోయే పొడి కూడా ఒకటి.ఈ పొడిని రోజు కనుక తీసుకుంటే అదిరిపోయే ఆరోగ్య లాభాలు మీ సొంతమవుతాయి.

Telugu Sleep, Tips, Insomniaproblem, Insomnia Powder, Insomnia, Latest-Telugu He

పొడి తయారీ కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వేయించుకున్న గుమ్మడి గింజలు( Pumpkin seeds ), అర కప్పు వేయించిన నువ్వులు( Sesame seeds ) వేసి పొడిలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లోకి వేసుకోవాలి.ఇప్పుడు గుమ్మడి గింజలు మరియు నువ్వుల పొడిలో హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి,( cardamom powder ) ఒక కప్పు బెల్లం పొడి వేసి బాగా కలిపి ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించడానికి గంట ముందు గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ తయారు చేసుకున్న పొడి కలిపి తీసుకోవాలి.ఈ పొడిలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ( Amino acid )ఉంటుంది.

ఇది నిద్రలేమికి చికిత్స చేయడంలో సహాయపడుతుంది.

Telugu Sleep, Tips, Insomniaproblem, Insomnia Powder, Insomnia, Latest-Telugu He

మన శరీరం ట్రిప్టోఫాన్‌ను సెరోటోనిన్‌గా మారుస్తుంది.ఇది మంచి అనుభూతిని కలిగించే హార్మోన్, ఇది మిమ్మల్ని రిలాక్స్‌గా మరియు మంచి నిద్రను ప్రేరేపిస్తుంది.రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టడం లేదని బాధపడుతున్న వారు ఈ పొడిని తీసుకుంటే కనుక హాయిగా నిద్రపోవచ్చు.

ఈ పొడి నిద్ర నాణ్యతని కూడా పెంచుతుంది.ప్రశాంతమైన నిద్రను మీ సొంతం చేస్తుంది.

పైగా రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో, ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడంలో మ‌రియు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడ‌టంలో కూడా ఈ పొడి ఎంతో ఉత్త‌మంగా స‌హాయ‌ప‌డుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube