ఆడా మగా అనే తేడా లేకుండా ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది బెల్లీ ఫ్యాట్( Belly fat ) సమస్యతో బాధపడుతున్నారు.ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, గంటలు తరబడి కూర్చుని ఉండడం, మద్యపానం అలవాటు తదితర అంశాలు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోవడానికి కారణం అవుతుంటాయి.
బాన పొట్ట కారణంగా బాడీ షేప్ అవుట్ అవ్వడమే కాకుండా మరెన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.ఈ క్రమంలోనే బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.
అయితే పొట్ట కొవ్వును కట్ చేసే పవర్ ఫుల్ డ్రింక్ ఒకటి ఉంది.రోజు ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే చాలా కొద్ది రోజుల్లోనే మీరు నాజుగ్గా మారతారు.
మరి ఇంతకీ ఆ పవర్ ఫుల్ డ్రింక్ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా అంగుళం అల్లం ముక్క ( ginger )తీసుకుని తొక్క తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక అల్లం తురుమును వేసుకోవాలి.
అలాగే అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon powder ), పావు టీ స్పూన్ జాజికాయ పొడి( Nutmeg powder ) వేసి మరిగించాలి.దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు బాయిల్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన తేనె( honey ) కలిపితే మన డ్రింక్ రెడీ అయినట్టే.మీరు కావాలి అనుకుంటే తేనెను స్కిప్ కూడా చేయవచ్చు.ఈ డ్రింక్ ను రోజు ఉదయం లేదా సాయంత్రం వేళలో తీసుకోవాలి.అల్లం, దాల్చిన చెక్క, జాజికాయ లో ఉండే పలు సమ్మేళనాలు పొట్ట కొవ్వును సమర్థవంతంగా కరిగిస్తాయి.
బెల్లీ ఫ్యాట్ ను కొద్ది రోజుల్లోనే మాయం చేస్తాయి.రోజుకు ఒకసారి ఈ డ్రింక్ ను తాగడం వల్ల మీరు మీ బాన పొట్టకు గుడ్ బై చెప్పవచ్చు.
అలాగే ఈ డ్రింక్ వెయిట్ లాస్ కు మద్దతు ఇస్తుంది.అరుగుదలను మెరుగుపరుస్తుంది.
గ్యాస్ సమస్య తలెత్తకుండా అడ్డుకుంటుంది.మరియు ఇమ్యూనిటీ పవర్ ను పెంచి సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.