ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే పండ్లలో బొప్పాయి( papaya ) ఒకటి.రుచి పరంగానే కాదు పోషకాల పరంగా కూడా బొప్పాయికి మరొకటి సాటి లేదు.
అనేక జబ్బులకు ఔషధంగా బొప్పాయి పండు పని చేస్తుంది.అయితే బొప్పాయి తినే క్రమంలో దాదాపు అందరూ తొక్కను తొలగించి డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.
బొప్పాయి తొక్క ఎందుకు పనికి రాదని భావిస్తుంటారు.మీరు అలానే అనుకుంటున్నారా.
అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు తప్పకుండా తెలుసుకోండి.
బొప్పాయి పండు లోనే కాదు బొప్పాయి తొక్కలోనూ ఎన్నో పోషకాలు ఉంటాయి.
బొప్పాయి పండు తొక్కలు( Papaya peels ) మన చర్మ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.అందుకోసం బొప్పాయి పండు తొక్కను ఏ విధంగా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని ఫ్రెష్ బొప్పాయి పండు తొక్కలు మరియు నాలుగు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ ( Rose water )వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ పెరుగు( curd ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై చర్మాన్ని సున్నితంగా కనీసం రెండు నుంచి మూడు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

మసాజ్ అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.బొప్పాయి పీల్ అనేక ఎంజైమ్లు మరియు విటమిన్లతో నిండిన సహజమైన ఎక్స్ఫోలియేటర్.పైన చెప్పిన విధంగా బొప్పాయి తొక్కను ఉపయోగిస్తే చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.
టాన్ రిమూవ్ అవుతుంది.మొటిమలు ఏర్పడటానికి దారి తీసే నూనె మరియు ధూళి క్లియర్ అవుతుంది.
చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మెరుస్తుంది.అలాగే బొప్పాయి పీల్ లో మాయిశ్చరైజింగ్ లక్షణాలు మెండుగా నిండి ఉంటాయి.
అందువల్ల ఇది చర్మాన్ని తేమగా సైతం ఉంచుతుంది.