ఈరోజుల్లో షాపింగ్ బిల్లులు మండిపోతున్నాయి, బతకడమే భారంగా మారుతోంది.అయితే ఓ ఫ్లోరిడా మహిళ( Florida Woman ) స్టోరీ మాత్రం డబ్బులు లేకుండానే విచ్చలవిడిగా షాపింగ్ చేస్తోంది.
కాకపోతే ఆమె షాపింగ్ మాల్స్‌లో కాదు, చెత్తకుండీల్లో( Trash ) కావలసినవి వెతుక్కుంటూ లక్షల రూపాయలను ఆదా చేసుకుంది.
ఆమె పేరు మెలానీ డయాజ్,( Melani Diaz ) వయసు 22 ఏళ్లే.
కంటెంట్ క్రియేటర్ ఈ అమ్మడు.రెండేళ్లలో ఏకంగా 50 వేల డాలర్లు. అంటే మన కరెన్సీలో అక్షరాలా 44 లక్షల రూపాయలు ఆదా చేసిందట ఎలా అంటే సింపుల్.“చెత్తకుండీల్లో డైవింగ్”( Dumpster Diving ) చేసిందంతే.న్యూయార్క్ పోస్ట్ చెప్పిన ప్రకార, బట్టలు, నిత్యావసర వస్తువులు ఇలా దేనికీ ఈమె డబ్బు ఖర్చు పెట్టట్లేదట.
ఇదంతా ఎలా మొదలైందంటే, సోషల్ మీడియాలో చెత్తబుట్టల్లోనే విలువైన వస్తువులు దొరుకుతున్న వీడియోలు చూసిందీ అమ్మడు.
అంతే, క్యూరియాసిటీ చంపలేక, తనే స్వయంగా రంగంలోకి దిగింది.ఫస్ట్ డైవ్‌లోనే పుస్తకాలు, బొమ్మలు, మళ్లీ వాడే వస్తువులు గుట్టలు గుట్టలుగా కనిపించాయి.
జనాలు ఇంత వృథా చేస్తున్నారా అని షాక్ అయిందట.అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఇప్పుడు రోజుకి నాలుగైదు గంటలు చెత్తకుండీల వేటలోనే ఉంటోంది.బట్టలు, ఇంటికి అలంకరణ వస్తువులు, పెంపుడు జంతువుల తిండి, ఇలా ఏది పడితే అది దొరుకుతోంది చెత్తకుండీలు వెతకడం మెలానీ లైఫ్‌నే మార్చేసింది.ఇప్పుడు ఫుల్‌టైమ్ జాబ్ కూడా అవసరం లేదంటోంది.ఎందుకంటే అంత డబ్బు ఆదా చేస్తోంది మరి.“నేను కూడబెట్టిన డబ్బుతో ప్రపంచం చుట్టేస్తున్నా” అని న్యూయార్క్ పోస్ట్‌తో చెప్పింది మెలానీ.

సింపుల్ రూల్ ఫాలో అవుతుందీమె.తనకి కావాల్సింది ఉంచుకుని మిగతాది డొనేట్ చేస్తుంది.దొరికిన వస్తువులు అమ్మదు కూడా.పుట్టింది కొలంబియాలో కావడంతో, అక్కడున్న పేద ప్రజల కోసం కొన్ని వస్తువులు పంపిస్తుందట.“చెత్తకుండీలు వెతకడం అంటే నాకిష్టం.ఏం దొరుకుతుందో ఎప్పుడూ ఊహించలేం.ఎప్పుడూ సర్‌ప్రైజే.” అంటోంది మెలానీ.
మెలానీ ఒక్కతే కాదు ఇలా చేసేది.
టెక్సాస్‌కి చెందిన ఓ అమ్మ కూడా చెత్తబుట్టల్లో దొరికిన వస్తువులు అమ్మి ఏడాదికి 76 వేల డాలర్లు సంపాదిస్తోందట.చెత్తకుండీలు వెతకడం వల్ల జనాలు ఒక్కటవుతున్నారు కూడా.
డేవ్ షెఫీల్డ్ (35), ఎరిన్ (39), వీళ్లిద్దరూ చెత్తకుండీ వెతుకుతూనే ప్రేమలో పడ్డారు.కొందరికి చెత్తకుండీలు వెతకడం డబ్బులు ఆదా చేసే మార్గం మాత్రమే కాదు, ఓ లైఫ్‌స్టైల్ అంతే.







