మెగా డాటర్ నిహారిక( Niharika ) ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా మరి సినిమాలను కూడా నిర్మిస్తూ సక్సెస్ అందుకుంటున్నారు.
ఇదిలా ఉండగా నిహారిక కెరియర్ మొదట్లో యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.బుల్లితెర యాంకర్ గా మొదలైన తన ప్రయాణం అనంతరం వెండితెర హీరోయిన్గా నటించారు.
వరుసగా మూడు సినిమాలలో హీరోయిన్గా నటించిన ఈమె ఏ ఒక్క సినిమా ద్వారా కూడా హిట్ అందుకోలేక పోయారు.
ఇలా ఇండస్ట్రీలో నిహారిక సక్సెస్ అందుకోకపోవడంతో తన కుటుంబ సభ్యులు తనకు పెళ్లి చేశారు.

ఇలా పెద్దలు నిశ్చయించిన అబ్బాయితోనే నిహారిక వివాహం ( Marriage )ఉదయపూర్ కోటలో ఎంతో అంగరంగ వైభవంగా మూడు రోజులపాటు జరిగింది.అయితే వీరి వైవాహిక జీవితం మాత్రం ఎక్కువ కాలం కొనసాగలేదని చెప్పాలి.ఏ మాత్రం సినీ బ్యాగ్రౌండ్ లేనటువంటి జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ( Venkata Chaitanya ) నిహారిక వివాహం జరగడంతో వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున భేదాభిప్రాయాలు వచ్చాయి.దీంతో పెళ్లైన రెండు సంవత్సరాలకి వీరిద్దరూ విడాకులు(Divorce) తీసుకొని విడిపోయారు.
ఇలా విడాకుల తర్వాత నిహారిక తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో బిజీ అవుతున్నారు.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె విడాకుల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

సెలబ్రిటీ హోదాతో సంబంధం లేకుండా విడాకులు అనేది ఏ అమ్మాయి జీవితంలోనైనా చాలా బాధాకరం అని తెలిపారు.విడాకుల గురించి ఆలోచిస్తూ ఎవరూ పెళ్లి బంధంలోకి ప్రవేశించరు.కానీ కొన్నిసార్లు పరిస్థితులు చాలా భిన్నంగా ఉండటమే కాకుండా అదుపు తప్పుతాయి.అలాంటి సమయంలోనే ఎంతో కఠినమైన నిర్ణయాలను తీసుకోవలసి ఉంటుంది.జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్ల నుంచి ఎన్నో నేర్చుకునే ఆస్కారం ఉంటుంది అంటూ ఈ సందర్భంగా నిహారిక విడాకుల గురించి మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి.ఈ వ్యాఖ్యలు విన్న నేటిజన్స్ విడాకులు తీసుకొని నిహారిక పశ్చాత్తాపడుతున్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.







