పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి ( S.S.Rajamouli ) ప్రస్తుతం మహేష్ బాబు ( Mahesh Babu ) తో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా ఎస్ఎస్ఎంబి 29( SSMB29 ) అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇప్పటికే హైదరాబాద్ సమీపంలోనే అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్ర బృందం అనంతరం అవుట్ డోర్ షూటింగ్ కోసం ఒరిస్సా( Odisha ) వెళ్లినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఒరిస్సాలోని దట్టమైన అటవీ ప్రాంతం కోరాపుట్ లో ల్యాండ్ అయ్యారు.మహేష్ బాబు ఒరిస్సా పోలీసులతో కరచాలనం చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.అయితే ఇందులో మరొక ఆసక్తికరమైన అంశం కూడా చోటుచేసుకుంది.
మహేష్ బాబుతో పాటు మరో హీరో కూడా షూటింగ్ పనుల నిమిత్తం వెళ్లడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.మహేష్ బాబుతో మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ( Prithviraj Sukumaran ) కూడా ఉన్నారు.
గత కొంత కాలంగా పృథ్వీ రాజ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది.

ఇక ఇదే విషయం గురించి పృథ్వీ రాజ్ ను ప్రశ్నించడంతో చర్చలు జరుగుతున్న ఇంకా ఫైనల్ కాలేదు అంటూ చెప్పుకొచ్చారు.కానీ ఒక్కసారిగా ఈయన కూడా ఒరిస్సా వెళ్లడంతో ఈ సినిమాలో పృథ్వీ రాజ్ మహేష్ బాబుకు విలన్ గా నటించబోతున్నారని తెలుస్తోంది.చుట్టూ అడవులు, కొండలు ఉన్న ప్రాంతంలో రాజమౌళి, మహేష్ బాబు చిత్రానికి సంబంధించిన సెట్స్ కనిపిస్తున్నాయి.
ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.ఇక ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు వెల్లడించారు.
ఇక ఇందులో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటిస్తున్న విషయం తెలిసిందే.







