ఏడాది పొడవునా లభించే పండ్లలో అరటి ముందు వరుసలో ఉంటుంది.చౌక ధరకే లభించినా అరటి పండులో( Banana ) బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి.
అందుకే ఆరోగ్యపరంగా అరటి పండు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.అలాగే అందాన్ని పెంచడంలోనూ అరటి సహాయపడుతుంది.
మొటిమలు మచ్చల నివారణకు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అరటి పండు ప్యూరీ, వన్ టేబుల్ స్పూన్ వేపాకు పొడి,( Neem Powder ) చిటికెడు పసుపు( Turmeric ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ విధంగా తరచూ చేస్తే మొటిమలు, మొండి మచ్చలు మాయం అవుతాయి.
అలాగే మిక్సీ జార్ లో నాలుగు అరటి పండు స్లైసెస్, రెండు బొప్పాయి పండు( Papaya ) ముక్కలు వేసుకుని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో తేనె కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత వాటర్ తో కడిగేయాలి.ఈ సింపుల్ రెమెడీని ఫాలో అవ్వడం వల్ల అదిరే అందం మీ సొంతం అవుతుంది.అరటి, బొప్పాయి, తేనె.ఇవి మూడు స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేస్తాయి.స్కిన్ ను గ్లోయింగ్ గా మెరిపిస్తాయి.
ఇక ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల అరటి పండు ప్యూరీ, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ బాదం నూనె వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.20 నిమిషాల తర్వాత వాటర్ తో కడిగేయాలి.ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మం యవ్వనంగా మెరుస్తుంది.
ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య లక్షణాలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.డ్రై స్కిన్ సమస్య సైతం అవుతుంది.