రోజూ స్నానానికి ముందు ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే నడుపు నొప్పి దూరం అవ్వాల్సిందే!

ఇటీవల రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా ఎంతో మంది కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో నడుము నొప్పి( Back Pain ) ఒకటి.వయసు పైబడిన వారే కాదు వయసులో ఉన్న‌వారు సైతం నడుము నొప్పితో బాధపడుతున్నారు.

 Follow This Simple Tip Before Taking A Bath Lower Back Pain Will Go Away Details-TeluguStop.com

జీవన శైలిలో మార్పులు, నిరంతరం గాడ్జెట్స్ ను వాడటం, గంటలు తరబడి నిలబడి ఉండటం తదితర అంశాలు నడుము నొప్పికి కారణం అవుతుంటాయి.ఈ క్రమంలోనే నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందడం కోసం పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు.

కానీ పెయిన్ కిల్లర్స్ ను అధికంగా వాడటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి.

కాబట్టి సహజంగా నడుము నొప్పిని ఎలా వదిలించుకోవచ్చు అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆవ నూనె( Mustard Oil ) మరియు రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె( Sesame Oil ) వేసి కలిపి వేడి చేయాలి.ఇలా వేడి చేసిన ఆయిల్ ను నడుముకు అప్లై చేసుకొని బాగా మర్ధనా చేసుకోవాలి.

ఆయిల్ రాసుకున్న గంట అనంతరం వేడి వేడి నీటితో స్నానం చేయాలి.రోజు స్నానానికి ముందు ఈ విధంగా చేశారంటే నడుము నొప్పి నుంచి సులభంగా బయటపడవచ్చు.

Telugu Pain, Pain Tips, Tips, Healthy, Latest, Simple Tips-Telugu Health

అలాగే ఎముకలు బ‌ల‌హీనంగా ఉన్న‌ప్పుడే న‌డుము నొప్పి వంటి స‌మ‌స్య‌లు బాధిస్తుంటాయి.కాబ‌ట్టి, ఎముక‌ల‌ను బ‌లోపేతం చేసుకోవాలి.అందుకు కాల్షియం మరియు విటమిన్ డి పుష్కలంగా ఉండే నువ్వులు, పాలు, పాల ఉత్ప‌త్తులు, గుడ్లు, బాదం, చేప‌లు, ఆకు కూర‌లు త‌దిత‌ర‌ల ఆహారాల‌ను తీసుకోవాలి.త‌ద్వారా వెన్నెముకలోని ఎముకలకు బలం చేకూరుతుంది.

న‌డుము నొప్పి ప‌రార్ అవుతుంది.

Telugu Pain, Pain Tips, Tips, Healthy, Latest, Simple Tips-Telugu Health

కొంద‌రికి హై హీల్స్ వేసుకోవ‌డం వ‌ల్ల న‌డుమ నొప్పి వ‌స్తుంటుంది.కాబ‌ట్టి ఎత్తు మడమల చెప్పులు( High Heels ) ఎక్కువగా వేసుకునే అల‌వాటు ఉంటే మానుకోండి.ఫ్లాట్ గా ఉండే చెప్పుల‌ను ప్రిఫ‌ర్ చేయండి.

నడుము నొప్పిని త‌గ్గించ‌డానికి కొన్ని వ్యాయామాలు ఉంటాయి.రెగ్యుల‌ర్ గా ఆ వ్యాయామాలు చేయ‌డం అల‌వాటు చేసుకోండి.

ఇక నడుము నొప్పితో బాధపడుతున్న వారు వేరుశనగ నూనె, మినప పదార్థాలు, వంకాయ వంటి ఆహారాల‌ను చాలా మితంగా తీసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube