ఒక్కసారిగా వాతావరణం లో మార్పులు సంతరించుకోవడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి.ఒక సీజన్ నుంచి ఇంకొక సీజన్ కు మారేటప్పుడు వాతావరణంలో ఇలాంటి మార్పులు సంతరించుకుంటాయి.
అంతేకాకుండా వాటితోపాటు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లకు దారి తీసే వ్యాధులను వెంట తెస్తాయి.వేసవి కాలంలో వాతావరణం ఎంతో చల్లగా ఉండటం వల్ల వివిధ రకాల వ్యాధులను వ్యాప్తి చేసే బ్యాక్టీరియాలు, వైరస్ లు పెరగడానికి ఎంతో అనువైన సమయం.
అయితే ఈ విషజ్వరాలు ఎలా వ్యాప్తి చెందుతాయి? వాటి నుంచి రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.వాతావరణంలో ఏర్పడే మార్పుల వల్ల బ్యాక్టీరియాలు వైరస్ లు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెంది అనేకమందిని ఈ వ్యాధుల బారిన పడేలా చేస్తాయి.
ఒక వ్యాధికారక వైరస్ ను మోస్తూ ఆరోగ్యమైన వ్యక్తికి దోమ కుట్టినప్పుడు ఆ వ్యక్తి అనారోగ్యం పాలవుతాడు.అతని నుంచి మరొకరికి ఈ వైరస్ వ్యాప్తి జరుగుతూ ఉంటుంది.
ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు చిన్న పిల్లలలో మరింత తీవ్రతరం చేస్తాయి.వారు ఎక్కువగా మట్టిలో ఆడుతూ ఉండడంవల్ల గాలిలోని వైరస్ ద్వారా, ఇన్ఫెక్షన్లు కావడంతో ఒక్కసారిగా వారిలో తీవ్రమైన జ్వరం, జలుబు, విరేచనాలు కావడం వంటివి అకస్మాత్తుగా తలెత్తుతాయి.
శీతాకాలంలో చలి తీవ్రత అధికంగా ఉండటం వల్ల మన శరీరంలోని రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల తెల్లరక్తకణాల సంఖ్య క్రమంగా తగ్గిపోయి డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.ఇటువంటి వైరల్ ఫీవర్ నుంచి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలను పాటించడం ఎంతో అవసరం.
శీతాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉండడం వల్ల మరిన్ని వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయి.దోమలను నివారించడానికి దోమతెరలు వాడడం, పొడవాటి దుస్తులు ధరించడం, సాయంత్రం వేళల్లో కిటికీ, తలుపులు మూసి వేయడం వల్ల దోమల నుంచి విముక్తి పొందవచ్చు.
చిన్నపిల్లలను వీలైనంత వరకు వారి శరీరం వెచ్చగా ఉంచటానికి ప్రయత్నించాలి.కాటన్ దుస్తులను ధరించడం, స్వెటర్లు, సాక్సులు వంటి వాటిని ధరించడం ద్వారా వారి శరీర ఉష్ణోగ్రతను నిలకడగా ఉండి ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతాయి.
వైరల్ ఇన్ఫెక్షన్ లతో పోరాడడానికి మన శరీరంలో తగినంత రోగనిరోధకశక్తి ఉండేలా, బలమైన ఆహారాన్ని పిల్లలకు పెట్టడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగు పరుచుకోవచ్చు.ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా వైరల్ ఫీవర్ నుంచి పిల్లలను కాపాడుకోవచ్చు.