నేడు ఏపీ కేబినెట్ సమావేశం( AP Cabinet Meeting ) జరగనుంది.సీఎం చంద్రబాబు( CM Chandrababu ) అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని బ్లాక్ వన్ లో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో( Deputy CM Pawan Kalyan ) పాటు, మిగతా మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు హాజరుకానున్నారు.ఈ సమావేశంలోని సీఆర్డీఏ ( CRDA ) ఆమోదించిన 23 అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.
మునిసిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానానికి సమయం కుదింపు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారాల్లో కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ లకు బదిలీ చేసే అంశం పైన ప్రధానంగా చర్చించనున్నారు.
వీటితో పాటు మరికొన్ని కీలక అంశాల పైన చర్చించనున్నారు .కొన్ని సంస్థలకు భూ కేటాయింపు ప్రతిపాదనలపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.విశాఖలో 11498 కోట్లతో తొలి దశలో 46.23 కిలోమీటర్లు, విజయవాడలో రూ 11,0009 కోట్లతో 38.4 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ లను మెట్రో రైల్ కార్పొరేషన్ పంపింది.విశాఖ విజయవాడ మెట్రో రైల్, డిపిఆర్ లకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనన్నారు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకినాడ పోర్టు( Kakinada Port ) అంశం పైన క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన చర్చించనున్నారు.ఏపీలో ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు ,డిపిఆర్ లపైన ఈ భేటీలో చర్చించనున్నారు.అలాగే సోషల్ మీడియా వేదికగా వేధింపులపై కేసులు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యల పైన మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు .వీటితో పాటు మరికొన్ని ప్రధాన అంశాలపైన చర్చించి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు.వీటితోపాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీల అమలు విషయం పైన చర్చించి మరికొన్ని పథకాలను అమల్లోకి తీసుకువచ్చే మంత్రి సమావేశంలో చర్చించనున్నారు అలాగే ప్రాజెక్టులతోపాటు ఏపీలో అభివృద్ధి పనులకు సంబంధించిన వ్యవహారాలపైన క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.