విదేశాలకు వెళ్లిన భారతీయులు స్థానిక ప్రజల జాతి వివక్షతకు బలైపోతున్నారు.ముఖ్యంగా అమెరికాలో( America ) ఇండియన్స్ పై జాతి వివక్ష వ్యాఖ్యలు( Racist Comments ) చేసే వారి సంఖ్య పెరుగుతోంది.
తాజాగా ఒక మహిళ అయితే అందరి ముందే ఇండియన్ ఫ్యామిలీని దారుణంగా తిట్టేసింది.ఆమె లాస్ ఏంజిల్స్‌లోని( Los Angeles ) యునైటెడ్ ఎయిర్‌లైన్స్ షటిల్ బస్సులో ప్రయాణిస్తున్న భారతీయ కుటుంబాన్ని ఉద్దేశించి జాతి వివక్ష చూపించింది.
ఆ బాధిత కుటుంబ పెద్ద ఒక ప్రముఖ ఫొటోగ్రాఫర్.ఆయన పేరు పర్వేజ్ తౌఫిక్.
( Pervez Taufiq ) చాలా దురదృష్టకరమైన ఈ ఘటనను ఆయన తన కెమెరాలో బంధించారు.
తౌఫిక్ ప్రకారం, ఆ మహిళ విమాన ప్రయాణం సమయంలో తన కుమారునిపై కూడా జాతి వివక్ష వ్యాఖ్యలు చేసింది.
చాలామంది ఉన్న బస్సులో కూడా ఆమె తన పిల్లలను “షటప్” అని అనడంతో పరిస్థితి మరింత దిగజారింది.ఆ మహిళ ఆ తర్వాత తౌఫిక్‌ను ఉద్దేశించి అసభ్యకరమైన భాషలో దూషించింది.
ఆమె ఆ కుటుంబ సభ్యులు ఇండియా( India ) నుంచి వచ్చారని, వారు ఇక్కడ ఏ రూల్స్ పాటించుకుండా, తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఆరోపించింది.
ఆమె వారి జాతిని ఉద్దేశించి అసభ్యకరమైన పదాలను ఉపయోగిస్తూ వారిని “పిచ్చివాళ్లు” అని కూడా అన్నది.ఎవరూ కూడా సహించలేని విధంగా ఆమె మాట్లాడింది.తౌఫీక్ ఆ మహిళను ఉద్దేశించి, భారతీయులు పిచ్చివాళ్లా? అని ప్రశ్నించారు.దాంతో ఆమె బాగా రెచ్చిపోయింది.“మీరు నా తందూరి ఆ** రికార్డ్ చేయబోతున్నారు” అని ఆమె మరింత అసభ్యకరమైన మాటలు మాట్లాడింది.తౌఫిక్ సెక్యూరిటీని పిలిచారు, కానీ ఆ మహిళ తాను తప్పు చేయలేదని వాదించింది.“నేను అమెరికన్‌ని, నువ్వు అమెరికన్ కావు.నువ్వు ఇండియా నుంచి వచ్చావు” అని కూడా ఆమె కౌంటర్ అటాక్ చేస్తుంది.తౌఫిక్ ప్రశాంతంగా, “నేను అమెరికాలోనే జన్మించాను” అని సమాధానం చెప్పారు.ఆమె అతనిని నమ్మలేదు సరి కదా తన పాస్‌పోర్ట్ చూపించమని డిమాండ్ చేసింది.
ఇతర ప్రయాణికులు ఈ ఘటనపై చాలా సీరియస్ అయ్యారు.ఆ మహిళ మద్యం మత్తులో ఉందని, అసభ్యంగా ప్రవర్తిస్తుందని, బస్సు నుంచి ఆమెను పెంచేయాలని స్టాఫ్‌కు చెప్పారు.చివరకు, యునైటెడ్ ఎయిర్‌లైన్స్( United Airlines ) ఉద్యోగి ఒకరు ఈ పరిస్థితిని పరిష్కరించడానికి వచ్చారు.
తౌఫిక్ తర్వాత ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, తన అసహనం వ్యక్తం చేశారు.ఆ మహిళ తన కుటుంబాన్ని అవమానించి, తన పిల్లలను అణచివేసిందని ఆయన పంచుకున్నారు.
ఈ సంఘటన జాతి వివక్ష ఎంత దుర్మార్గమైనదో మరోసారి నిరూపించింది.ఒక వ్యక్తిని వారి జన్మస్థలం ఆధారంగా అవమానించడం అత్యంత దారుణమైనది.
ఈ రకమైన ప్రవర్తనను ఎవరు సహించకూడదు.