తమ గుంపును కాపాడుకోవడానికి ప్రాణ త్యాగం చేసిన అడవి దున్న.. అంతలోనే వెన్నుపోటు..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వైల్డ్‌లైఫ్ వీడియో( Wildlife Video ) వైరల్‌గా మారింది.ఈ వీడియో అటవీ జీవితం ఎంత క్రూరమైనదో మరోసారి ప్రూవ్ చేస్తోంది.

 Bison Throws The Young Member Of Its Herd To The Wolves To Escape Viral Video De-TeluguStop.com

అదే జాతికి చెందిన జంతువులు కూడా మనుగడ కోసం ఒకదాన్ని ఒకటి ఎలా వెన్నుపోటు పొడుస్తాయో ఈ క్లిప్ స్పష్టంగా చూపిస్తుంది.@AMAZlNGNATURE అనే అకౌంట్ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది.

ఈ క్లిప్‌లో రెండు అడవి దున్నలను( Bison ) ఒక గుంపు తోడేళ్లు వేటాడుతున్నాయి.తోడేళ్లు( Wolves ) దగ్గరగా వస్తుండగా, ఒక అడవి దున్న ఆశ్చర్యకరమైన, క్రూరమైన పని చేస్తుంది.

ఇతర అడవి దున్నను తోడేళ్ల వైపు నెట్టివేసి, తాను మాత్రం సురక్షితంగా తప్పించుకుంటుంది.

ఈ వీడియో ఓపెన్ చేయగానే మనకు ముందుగా ఒక మంచు ప్రాంతం లాంటిది కనిపిస్తుంది.తర్వాత తన గుంపును కాపాడుకోవడానికి ఒక అడవి దున్న తోడేళ్ల దగ్గరికి వెళ్లి వాటితో పోరాడటం కనిపించింది.కనీసం ఒక 10 తోడేళ్ల దాకా దాన్ని చుట్టుముట్టాయి.

అది అలా వాటితో పోరాడుతుంటే మరో పెద్ద అడవి దున్న అక్కడికి వచ్చింది.అది తోడేళ్లతో పోరాడుతున్న అడవి దున్నకు సహాయం చేయడానికి బదులుగా దానిని బలంగా వచ్చి గుద్దింది.

అంతే అది కింద పడిపోయింది.తోడేళ్లకు ఆహారం అయ్యింది.

ఈ దృశ్యాలు కళ్లతో చూసిన నమ్మలేనంత షాకింగ్‌గా ఉన్నాయని చెప్పుకోవచ్చు.

ఈ ఘటన జంతు రాజ్యం గురించి ఒక కఠిన సత్యాన్ని బయటపెడుతుంది, మనుగడ కోసం జంతువులు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాయి.అడవిలో శాకాహార జీవులకు పులులు, సింహాల వంటి భీకరమైన మృగాలే ప్రధాన ముప్పు అని మనం అనుకుంటాం కానీ, ఈ వీడియో చూపిస్తున్నట్లు ముప్పు ఎక్కడి నుండి వస్తుందో తెలియదు.అదే జాతికి చెందిన జంతువులు కూడా ఒకదానికొకటి ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉంటాయి.

తన ప్రాణం కాపాడుకోవడానికి తన స్నేహితుడిని తోడేళ్ల వైపు నెట్టివేసిన బైసన్‌ ప్రవర్తన ఇందుకు నిదర్శనం.ఈ వీడియోను లక్షలాది మంది చూశారు, సోషల్ మీడియాలో చాలా చర్చలకు దారితీసింది.

జంతువుల మధ్య నిజమైన స్నేహం లేదా నమ్మకం ఉంటుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన స్నేహితుడిని త్యాగం చేసిన అడవి దున్న ప్రవర్తన చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube