నార్త్ ఇండియా లెక్కల ప్రకారం రామ్ చరణ్( Ram Charan ), యశ్, ఫాహద్ ఫాజిల్( Yash, Fahad Fazil ) టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు.ఎందుకంటే వారి దృష్టిలో వీరు వందల కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టిన హీరోలు.
రామ్ చరణ్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా 1250 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది.తారక్ తో పోలిస్తే రామ్ చరణ్ మొదటి నుంచి బాలీవుడ్ హీరో అని చెప్పుకోవచ్చు అందుకే తారక్ కన్నా కూడా రామ్ చరణ్ త్వరగా నార్త్ ఇండియన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు.
మరోవైపు యశ్ కూడా కే జి ఎఫ్ ద్వారా 1250 కోట్ల రూపాయల ఎలక్షన్స్ తో స్టార్ హీరో రేస్ లో ఉన్నాడు.ఇక మలయాళీ హీరో పహాద్ ఫాజిల్ కూడా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ పుష్ప సినిమా ద్వారా సాధించడంతో టాప్ హీరోల లిస్టులో మూడవ స్థానంలో ఉన్నాడు.

ఈ ముగ్గురు హీరోలని నార్త్ ఇండియన్స్ స్టార్ హీరోలుగా చూడటంలో వారి మతలబు సంగతి పక్కన పెడితే వీరి నుంచి మరిన్ని అద్భుతాలు ఎదురుచూస్తున్నారు.ఒక్క మాటలో చెప్పాలంటే వీరు ఇండియా సినిమా స్టాండర్డ్స్ ని పెంచినట్టుగా బాలీవుడ్ భావిస్తోంది.ఇక ఆస్కార్ వేదికలో కనిపించిన రామ్ చరణ్ ని దాదాపు బ్రాడ్ ఫిట్ తో పోలుస్తూ బాలీవుడ్ మీడియా మరియు సోషల్ మీడియా కోడైకుస్తోంది.ఇక పుట్టినరోజు నాడు గేమ్ చేంజ్ పోస్టర్తో తన బర్త్డే ఫుల్ ఖుషి గా జరుపుకున్నాడు రామ్ చరణ్.
ఇక ఈ ముగ్గురు హీరోల విషయంలో చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఒకే సమయంలో దాదాపు కొంచెం అటు ఇటుగా ఈ ముగ్గురు హీరోలు కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

యష్ విషయానికొస్తే కేజిఎఫ్( KGF ) సినిమాల తర్వాత మరో సినిమాని ప్రకటించలేదు.కానీ అద్భుతాలు జరగాలంటే కాస్త సమయం పడుతుందని, అభిమానులు ఓపికగా ఎదురు చూడాలని, తాను అతి త్వరలో గ్లోబల్ స్థాయిలో మరొక గొప్ప సినిమా తీయబోతున్నట్టుగా ఇన్ డైరెక్ట్ గా తన పుట్టినరోజు నాడు హింట్ ఇచ్చాడు.ఇక మలయాళం హీరో ఫాహద్ ఫాజల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
మలయాళీ టాలెంట్ పవర్ హౌస్ అంటూ ప్రేక్షకులు అంతా కూడా అతడిని పొగుడుతున్నారు పుష్ప 2 మరియు విక్రమ్ 2 సినిమాలతో త్వరలోనే విజయభేరి మోగించనున్నాడు.