టాలీవుడ్ హీరో జునియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా దేవర.( Devara ) కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది.
నెట్ ఫ్లిక్స్ లో( Netflix ) గత నాలుగు వారాలుగా ఈ సినిమా టాప్లో ట్రెండ్ అవుతూనే ఉంది.మరోసారి టాప్ లో ఉన్నట్లుగా నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

దేవర సినిమా వరుసగా 4వ వారం ట్రెండ్ అవుతోంది అంటూ యూనిట్ సభ్యులు అధికారికంగా వెళ్లడించారు.2.8 మిలియన్ ల వ్యూస్ తో 8.1 మిలియన్ ల వాచ్ అవర్స్ తో దేవర ఆధిపత్యం కొనసాగుతోంది అంటూ నెట్ఫ్లిక్స్ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేసింది.ఏడు దేశాల్లో దేవర సినిమా టాప్ 10 ప్లేస్ల్లో కొనసాగుతోంది.ఆఫ్రికాలోని ఒక దేశంతో పాటు ఆసియాలో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక, యూఏఈ లో ఈ సినిమా ట్రెండ్ అవుతున్నట్లుగా నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు ఫాన్స్.

ఒకవైపు అల్లు అర్జున్( Allu Arjun ) నటిస్తున్న సినిమా విడుదల అవుతున్న సమయంలో కూడా దేవర సినిమా లీడర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవ్వడంతో పాటు అక్కడ దేవర హవా నడుస్తుండడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా( Pushpa 2 ) విడుదల కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది.ఇలాంటి సమయంలో కూడా కొన్ని దేశాలలో అలాగే ఓటీటీ లో కూడా దేవర హవా కనిపిస్తుండడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.