జార్ఖండ్ డైనమిక్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని( Mahendra Singh Dhoni ) పేరు ఏదైనా బ్రాండ్ ఒకటే.ప్రపంచంలో ఏ కెప్టెన్ కు సాధ్యం కానీ రికార్డులను టీమిండియా తరఫున మహేందర్ సింగ్ ధోని సాధించాడు.
కాబట్టి, మహేంద్రసింగ్ ధోని గురించి ఏ ఒక్కరికి ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచ క్రికెట్ కు ఆయన వీడ్కోలు తెలిపి దాదాపు 5 సంవత్సరాల గడుస్తున్న ఇంకా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడ తగ్గలేదు.
దీనికి కారణం ఓ రకంగా ఐపీఎల్ అని చెప్పవచ్చు.చెన్నై సూపర్ కింగ్స్( CSK ) జట్టుతో అతడు ఇంకా కొనసాగుతుండడంతో.
క్రికెట్ అభిమానులు ఆయనను ఇంకా అభిమానిస్తూనే ఉన్నారు.ఇకపోతే, తాజాగా మహేంద్రసింగ్ ధోని తన భార్య సాక్షితో( Sakshi ) కలిసి డాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

గత వారం రోజుల కిందట ముగిసిన ఐపీఎల్ వేలం తర్వాత జరిగిన విషయం తెలిసిందే.ఇకపోతే ఐపీఎల్( IPL ) సీజన్ కు మరింత సమయం ఉండడంతో ధోని తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.ఇకపోతే తాజాగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తరాఖండ్ లోని( Uttarakhand ) రిషికేషులో పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా మహేంద్ర సింగ్ ధోని, భార్య సాక్షిలు జానపద గీతం ‘గులాబీ షరార’ పాటకు అద్భుతంగా డాన్స్ చేసి వావ్ అనిపించారు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇకపోతే, జరగబోయే ఐపీఎల్ 2025 లో అన్ క్యాప్డ్ ప్లేయర్గా నాలుగు కోట్లకు ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.దీంతో రిటైర్డ్ అవుతాడనుకున్న మహేంద్ర సింగ్ ధోని మరోసారి గ్రౌండ్ లో కనిపించబోతుండడంతో అభిమానులు తెగ ఆరాట పడిపోతున్నారు.గత సీజన్ లో కూడా మోకాలికాయంతో ఇబ్బంది పడిన మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఆర్డర్ లో చివర్లో వచ్చి తన పాత్రను పోషించి బౌండరీస్ వర్షంతో అభిమానులని ఆనందంలో ఉంచేవాడు.