న్యాచురల్ స్టార్ నాని(natural star nani) ప్రస్తుతం కెరీర్ పరంగా టాప్ లో ఉన్నారు.నాని నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించగా తర్వాత సినిమాలతో నాని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
కొన్ని రోజుల క్రితం నాని నటించిన విడుదలైన హిట్3 టీజర్ (HIT 3 Teaser)ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.
అయితే నాని శ్రీకాంత్ ఓదెల(nani sreekanth odela ) కాంబినేషన్ లో ది ప్యారడైజ్ అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా నుంచి ఈ నెల 3వ తేదీన గ్లింప్స్ రిలీజ్ కానుంది.అయితే ఈ గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తోంది.
నాని లుక్ న భూతో న భవిష్యత్ అనేలా ఉంటుందని గ్లింప్స్ లో బూతులు కూడా ఉంటాయని సమాచారం అందుతోంది.

న్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే కాంబినేషన్ అవుతుందని పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.నాని పారితోషికం 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా భవిష్యత్తు సినిమాలతో నాని మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాల్సి ఉంది.నాని క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

నాని ఒక్కో మెట్టు ఎదిగి కెరీర్ పరంగా ఈ స్థాయికి చేరుకున్నారు.సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే నాని (Nani)మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవడం పక్కా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.శ్రీకాంత్ ఓదెల సైతం ది ప్యారడైజ్ సినిమాతో దర్శకుడిగా ఎన్నో మెట్లు ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.నాని కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.







