నకిలీ పత్రాలతో ఎన్ఆర్ఐ భూమి విక్రయం.. సబ్ రిజిస్ట్రార్ సహా 9 మంది అరెస్ట్

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వివిధ దేశాలలో స్థిరపడిన ప్రవాస భారతీయులు దేశానికి ఎంతో సేవ చేస్తుంటే సొంత గ్రామాలలోని వారి ఆస్తులు మాత్రం ఆక్రమణకు గురవుతున్నాయి.దేశంలో పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలను కలిగి ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి.

 Sub-registrar Among 9 Booked For Fraudulently Selling Nri’s Land In Punjab , P-TeluguStop.com

అయితే వివిధ దేశాల్లో స్థిరపడిన పంజాబీ ఎన్ఆర్ఐలు( Punjabi NRIs ) రాష్ట్రంలో ఉన్న తమ ఆస్తులకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ప్రవాసుల ఆస్తులను కొందరు అక్రమించుకోవడం, నకిలీ పత్రాలను సృష్టించి తమ సొంతం చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.

ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇది ముఖ్యమైనది.రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్ఆర్ఐ సెల్‌‌కు ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులలో ఎన్ఆర్ఐల భూముల ఆక్రమణ కీలకమైనది.

Telugu Deep Singh, Deepak Goel, Gurcharan Singh, Ludhiana, Punjab, Punjabi Nris,

తాజాగా ప్రవాస భారతీయుడి భూమికి సంబంధించి సేల్ డీడ్ జారీ చేశారనే ఆరోపణలపై సబ్ రిజిస్ట్రార్ సహా 9 మంది నిందితులపై విజిలెన్స్ బ్యూరో ( Vigilance Bureau )శుక్రవారం కేసు నమోదు చేసింది.అలాగే ఓ న్యాయవాదిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.నకిలీ పత్రాలను ఉపయోగించి నిందితుడు సేల్ డీడ్‌ను జారీ చేసినట్లు విచారణలో తేలింది.ఈ భూమి అమెరికాలో నివసిస్తున్న దీప్ సింగ్ ( Deep Singh )అనే ఎన్ఆర్ఐకి చెందినదని, మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు అక్రమంగా విక్రయించబడిందని అధికారులు తెలిపారు.

Telugu Deep Singh, Deepak Goel, Gurcharan Singh, Ludhiana, Punjab, Punjabi Nris,

ఈ భూమి రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేయడంలో కీలకపాత్ర పోషించిన లూథియానాకు( Ludhiana ) చెందిన న్యాయవాది గుర్చరన్ సింగ్‌ను( Gurcharan Singh ) కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ మోసపూరిత భూమి రిజిస్ట్రేషన్ గురించి నిఘా వర్గాల సమాచారం మేరకు ఫిబ్రవరి 21న వెస్ట్ తహసీల్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.నూర్పూర్ బెట్ గ్రామంలోని లో ధోవల్ – వెర్కా బైపాస్ సమీపంలో ఉన్న ప్రధాన భూమికి ఫిబ్రవరి 11న పంచకులకు చెందిన దీప్ సింగ్, దీపక్ గోయెల్ మధ్య రూ.30 లక్షలకు సేల్ డీడ్ జరిగిందని దర్యాప్తులో తేలింది.ఈ భూమి మార్కెట్ విలువ రూ.6 కోట్ల పైమాటే.దీని నిజమైన యజమాని 55 ఏళ్ల దీప్ సింగ్ పుట్టినప్పటి నుంచి అమెరికాలో నివసిస్తున్నాడని అధికారులు తెలిపారు.ఈ దర్యాప్తులో రెవెన్యూ అధికారుల లోపాలు బయటపడ్డాయి.వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో , లావాదేవీలలో పాల్గొన్న వారి గుర్తింపును ధృవీకరించడంలో విఫలమయ్యారని అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube