తెలివితేటలు ఒక్కరి సొంతం కాదు అనే మాటని నిజం చేస్తూ, కొందరు తమ వినూత్న ఆలోచనలతో ఆశ్చర్యపరుస్తుంటారు.అలాంటి ఓ వ్యక్తి తెలివైన ఐడియాతో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాడు.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో, ఓ వ్యక్తి తన ఇంటి భద్రత కోసం సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు.అయితే సాధారణంగా గోడకు అమర్చే కెమెరా స్థానంలో, ఇంటి చుట్టూ కవర్ అయ్యేలా ఒకే కెమెరాను వినూత్నంగా ఉపయోగించేందుకు విచిత్రమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.

దీనికోసం ఆయన టేబుల్ ఫ్యాన్ హెడ్‌ను(Table fan head) తీసి, గోడకు ఫిక్స్ చేశాడు.ఆ తర్వాత ఫ్యాన్‌పై సీసీ కెమెరాను(CC Camera) అమర్చాడు.ఫ్యాన్‌ను ఆన్ చేయగానే కెమెరా అటూ ఇటూ తిరుగుతూ 360 డిగ్రీల కోణంలో పరిసరాలను రికార్డ్ చేయడం మొదలుపెట్టింది.ఈ తెలివైన ఆలోచన చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.

ఈ వీడియోపై నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.“ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు అందు కొందరు కామెంట్ చేస్తుండగా.మరికొందరేమో., ఇలాంటి ఆలోచనలు మాకెందుకురావని కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇంకొందరేమో.మీ ఆలోచన సూపర్ బ్రో అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరికొందరు ఫన్నీ ఎమోజీలతో సైతం రియాక్షన్స్ పెడుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో లక్షల సంఖ్యలో వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్‌ను సాధించి వైరల్‌గా మారింది.
ఈ సరికొత్త ఆలోచన భద్రతా చింతనతో పాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సృజనాత్మకంగా ఉపయోగించుకునే విధానాన్ని తెలియజేస్తోంది.నేటి డిజిటల్ యుగంలో ఇలాంటి విభిన్న ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటూనే ఉంటాయి.






