మనం ఆహారంగా తీసుకునే రుచికరమైన పండ్లలో పైనాపిల్( Pineapple ) కూడా ఒకటి.పైనాపిల్ పుల్ల పుల్లగా,తియ్య తియ్యగా రుచిగా ఉంటుంది.
దీని ముక్కలుగా కట్ చేసుకుని, అలాగే జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉండవచ్చు.చాలా మంది పైనాపిల్ ను తినడానికి ఇష్టపడతారు.
అలాగే ఈ పండు మనకు అన్ని సీజన్ లలోనూ లభిస్తుంది.పైనాపిల్ ను తీసుకోవడం వలన మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
దీనిలో ఎన్నో రకాల పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.అంతేకాకుండా పైనాపిల్ ని తీసుకోవడం వలన మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

పైనాపిల్ లో ఉండే పోషకాలు, అలాగే దీనిని తీసుకోవడం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల( Health benefits ) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.విటమిన్ బి-6, విటమిన్ సి, మాంగనీస్, పోలేట్, కాపర్, ఫైబర్ లాంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.పైనాపిల్ ను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.దీనిలో ఉండే ఎంజైమ్ లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో మనకు ఎంతగానో సహాయపడతాయి.అలాగే దీనిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.దీన్ని తీసుకోవడం వల్ల అజీర్తి, మలబద్దకం( Dyspepsia, constipation ) లాంటి సమస్యలు తగ్గుతాయి.
అలాగే పొట్ట ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.

పైనాపిల్ లో విటమిన్ సి( Vitamin C ) ఎక్కువగా ఉంటుంది.ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.దీంతో మనకు వాతావరణ మార్పుల కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండవచ్చు.
అలాగే పైనాపిల్ ను తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.రక్తపోటుతో బాధపడేవారు కూడా పైనాపిల్ ను తీసుకోవడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు.అంతేకాకుండా దీనిలో విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.పైనాపిల్ ను తీసుకోవడం వలన మచ్చలు వంటి సమస్యలు తగ్గి చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.