ఆరోగ్యానికి పెరుగు కంటే మజ్జిగ ప్రయోజనకరమా..

మనలో చాలామంది పాలు, పెరుగు లేకుండా అసలు ఆహారం తినరు.పాల నుంచి పెరుగు దాని నుంచి మజ్జిగ వచ్చినప్పటికీ మూడింటిని మధ్య చాలా తేడాలే ఉంటాయి.

 Is Buttermilk More Beneficial Than Curd For Health, Buttermilk , Curd , Curd ,-TeluguStop.com

అవి అందించే పోషకాలు ప్రయోజనాలు కూడా భిన్నంగా ఉంటాయి.ఇక ఈ క్రమంలో పాలు, పెరుగుకు బదులుగా మజ్జిగ తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

అందుకు ఈ మూడు శరీరంలో ప్రతి స్పందించే విధానంలో మార్పులే అందుకు కారణమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది.

అది కడుపులో నొప్పి వచ్చినప్పుడు కూడా కడుపులోని వేడి ఆమ్లాలు పులియబెట్టడం జరుగుతుంది.దాని వల్ల కడుపులోని ప్రేగులు వేడెక్కుతాయి.

కానీ పెరుగు నుంచి వచ్చిన మజ్జిగ మాత్రం శరీరాన్ని చల్ల పరుస్తుందని చెబుతున్నారు.మజ్జిగ అన్ని రకాల వాతావరణ సీజన్లకు అనుకూలంగా ఉంటుంది.

అందుకే పెరుగు కంటే మజ్జిగ చాలా ఆరోగ్యాకరమైనదని చెబుతున్నారు.

Telugu Bacteria, Black Pepper, Buttermilk, Cough, Curd, Gastic, Gastric Problem,

ఊబకాయం, కఫా రుగ్మతలు, రక్తస్రావం, వాపు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్లు పెరుగుకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా రాత్రి పూట పెరుగు తినకూడదని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.ఎందుకంటే ఇది జలుబు, దగ్గు సైనస్ వంటి సమస్యలను పెంచుతుంది.

ఒకవేళ రాత్రిపూట పెరుగు తినకుండా ఉండలేని వారు అందులో చిటికెడు మిరియాలు లేదా మెంతులు వేసుకొని తినడం అలవాటు చేసుకోవాలి.

Telugu Bacteria, Black Pepper, Buttermilk, Cough, Curd, Gastic, Gastric Problem,

పెరుగును వేడి చేయడం వల్ల అందులోని మంచి బాక్టీరియా నాశనం అవుతుంది.చర్మ వ్యాధులు, పిత్త అసమతుల్యత తలనొప్పి, నిద్రలేమి, జీర్ణ సమస్యలు ఉన్నవారు పెరుగు తినకపోవడమే మంచిది.మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి, పింక్ సాల్ట్, కొత్తిమీర వేసి తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మజ్జిగ జీర్ణం కావడానికి తక్కువ సమయం పడుతుంది.కానీ పెరుగు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

మల బద్ధకం, గ్యాస్టిక్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ లాంటి జీర్ణ సమస్యలు ఉండేవారు మజ్జిగ తాగడం వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube