ప్రభాస్ పై అల్లు శిరీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్... అల్లు అర్జున్ పరువు తీసాడుగా?

అల్లు శిరీష్( Allu Shirish ) హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాలలో నటిస్తున్నారు.అయితే ఈయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా కాలం అవుతున్న ఇప్పటివరకు సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు.

 Allu Arjun Fans Fire On Allu Shirish Comment About Prabhas, Prabhas, Allu Arjun,-TeluguStop.com

ఇక త్వరలోనే బడ్డీ ( Buddy ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా జులై 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోని వరుస యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలలో ఈయన పాల్గొంటున్నారు.

Telugu Allu Arjun, Allu Shirish, Buddy, Prabhas, Pushpa-Movie

ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎందుకని మీరు వరుస సినిమాలు చేయడం లేదు అలాగే మీకు పర్సనల్ టీం ఎందుకు లేదు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ ప్రభాస్ ప్రస్తావనకు తీసుకువచ్చారు.

ప్రేక్షకులు మనల్ని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు ప్రత్యేకంగా టీం అవసరం లేదని వరుసగా సినిమాలు చేస్తూ పోతే చాలని తెలిపారు.ఇప్పుడు ప్రభాస్( Prabhas ) స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

ఆయన ప్రతి 10 నెలలకు ఒకసారి ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తారు.

Telugu Allu Arjun, Allu Shirish, Buddy, Prabhas, Pushpa-Movie

ఆయన పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ ఎలాంటి హడావిడి చేయరు.ఏ ఫంక్షన్లకు రారు తన సినిమాలకు మాత్రం చిన్న ప్రమోషన్లను చేస్తూ ఉంటారు.ఇక ఇప్పటివరకు ప్రభాస్ కి ఎలాంటి పిఆర్ టీమ్ కూడా లేదు.

ఇలా ఎన్నో విషయాలు ప్రభాస్ గారి నుంచి మనం నేర్చుకోవాలని ఆయన సింప్లిసిటీకి నిదర్శనం అని తెలిపారు.ఇలా ప్రభాస్ గురించి పొగుడుతూనే ఈయన చేసిన కామెంట్లు అల్లు అర్జున్ ( Allu Arjun )పై సెటైర్లు వేసినట్లు ఉన్నాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

గత ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ కు 10 సంవత్సరాల నుంచి పిఆర్ టీమ్ ఉందని ఆయన పాన్ ఇండియా హీరో అయిన తర్వాత ఈ టీం మరింత విస్తరించిందని చెప్పడంతో పరోక్షంగా బన్నీ పరువును తీసినట్టే ఉంది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube