వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కష్ట కాలం కొనసాగుతూనే ఉంది .ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గర నుంచి కీలక నాయకులు చాలామంది పార్టీకి రాజీనామా చేయడం, ఇతర పార్టీలలో చేరిపోవడం వంటివి సర్వసాధారణం అయిపోయింది.
అయితే జగన్ ను( Jagan ) నమ్మిన బంటుగా మొదటి నుంచి ఆయన వెంట నడుస్తూ వస్తున్న వారు సైతం ఇప్పుడు కష్టకాలంలో పార్టీని వీడి వెళ్లిపోవడం వైసీపీలో( YCP ) ప్రకంపనలు సృష్టిస్తోంది .వైసీపీ తరఫున రాజ్యసభ లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు రాజీనామా చేయబోతున్నట్లుగా వార్తలు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి.తాజాగా మోపిదేవి వెంకటరమణ,( Mopidevi Venkataramana ) బీద మస్తానరావు( Beeda Mastan Rao ) రాజీనామా చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈరోజు రాజ్యసభ చైర్మన్ కు వారు రాజీనామా పత్రాలు ఇవ్వబోతున్నట్లు సమాచారం .ఆ తరువాత వైసిపి ప్రాథమిక సభ్యత్వం కూడా రాజీనామా చేయునున్నట్లు తెలుస్తోంది.బీద మస్తాన్ రావు , మోపిదేవి వెంకటరమణ త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది .వీరిద్దరితో పాటు మిగిలిన రాజ్యసభ సభ్యులు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ,టిడిపి , బిజెపి ,జనసేన లలో ఏదో ఒక పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.రాజ్యసభ సభ్యులతో పాటు, మరి కొంతమంది కీలక నాయకులు పార్టీని వీడే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.
వైసీపీ నుంచి ప్రస్తుతం 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ సభలో టిడిపికి ప్రాతినిధ్యం లేదు.ఆ 11 మంది ఎంపీలలో ఇద్దరు ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబును( CM Chandrababu ) కలిసినట్టు సమాచారం.
ఇప్పటికే వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీకి , ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు.త్వరలోనే టిడిపి కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అలాగే ఎప్పటి నుంచో పార్టీలో అసంతృప్తితో ఉంటున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీ మారే ఆలోచనతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ నుంచి ఎటువంటి సహకారం లభించడం లేదని బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.
ఇక మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా వైసీపీకి రాజీనామా చేయబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.దీనికి తగ్గట్లుగానే సోషల్ మీడియా ఎకౌంట్లలో జగన్ ను అన్ ఫాలో చేయడమే కాకుండా వైసిపి అనే పేరును తొలగించారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం వైసీపీలో ఆందోళన కలిగిస్తుంది.