చరణ్ పై విమర్శలు చేసిన వాళ్లకు స్వామీజీ స్ట్రాంగ్ కౌంటర్.. ఆయన ఏమన్నారంటే?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ( Star hero Ram Charan )సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు.కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 Radha Manohar Das Strong Counter Negative Comments About Charan Details Inside G-TeluguStop.com

శంకర్( Shankar ) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా కార్తీక్ సుబ్బరాజు ( Karthik Subbaraju )ఈ సినిమాకు కథ అందించారు.రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో తండ్రీ కొడుకు పాత్రల్లో ఈ సినిమాలో కనిపించనున్నారనే సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ ఇలా తండ్రి పాత్రలో వయస్సుకు మించిన పాత్రలో నటించడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు.అయితే చరణ్ పై తాజాగా విమర్శలు వ్యక్తమయ్యాయి.చరణ్ అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు వెళ్లడంపై చాలామంది నెగిటివ్ కామెంట్లు చేశారు.అయితే చరణ్ పై వచ్చిన విమర్శలకు స్వామీజీ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

Telugu Klinkara, Radhamanohar, Shankar, Ram Charan-Movie

రాధా మనోహర్ దాస్ ( Radha Manohar Das )మాట్లాడుతూ రామ్ చరణ్ నిజమైన భక్తుడని ఆయన అన్నారు.చరణ్ శివాలయాన్ని శుభ్రం చేస్తాడని వారి పాపకు క్లీంకార( Klinkara ) అని పేరు పెట్టారని కామెంట్లు చేశారు.ఎవరికైనా చరణ్ తప్పు చేసినట్టు అనిపిస్తే నా దగ్గరకు రావాలని కూర్చుని మాట్లాడుకుందామని ఆయన కామెంట్ చేశారు.రామ్ చరణ్ గురించి తప్పుగా మాట్లాడవద్దని రాధా మనోహర్ దాస్ పేర్కొన్నారు.

Telugu Klinkara, Radhamanohar, Shankar, Ram Charan-Movie

మరోవైపు ఉపాసన సైతం దేవుడిపై విశ్వాసం అనేది అందరినీ ఏకం చేస్తుందని అంతే తప్ప మన దేశానికి చెందిన వాళ్లను విడిపోయేలా చేయదని పేర్కొన్నారు.ఐకమత్యంగా ఉండటమే మన బలమని ఆమె చెప్పుకొచ్చారు.తన మతంను అనుసరిస్తూ ఇతర మతాలను గౌరవించడం సనాతన ధర్మాన్ని పాటించడం అవుతుందని ఆమె కామెంట్లు చేశారు.ఉపాసన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube