విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha Steel Plant ) ప్రైవేటీకరణ అంశం ఏపీలో గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.గత ఎన్డీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే విషయంలో దూకుడు ప్రదర్శించింది.
ఆ సమయంలోనే ఏపి నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి.ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల( AP Assembly Elections ) సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారం లోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వమని హామీ ఇచ్చారు.
అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించేందుకు కేంద్రం మొగ్గు చూపుతోందని వైసీపీ( YCP ) నేతలు ఆరోపిస్తూ, ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు.తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు తాము కట్టుబడి ఉన్నామని , అది అందరి కమిట్మెంట్ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ నడిపించే విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని, మైన్స్, స్కిల్స్ డెవలప్మెంట్ ( Mines, Skills Development )వంటి అంశాలలో సవాళ్లు ఎదురవుతున్నాయని పవన్ అన్నారు.
నెలరోజుల క్రితం కార్మికులతో తాను మాట్లాడానని, కార్మికుల సమస్యలకు సంబంధించి పూర్తి కార్యాచరణ రూపొందిస్తే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారితో చెప్పినట్లుగా పవన్ తెలిపారు.
ఇక ఇదే విషయంపై మంత్రి అచ్చెన్న నాయుడు ( Minister Achenna Naidu )కూడా స్పందించారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపుతామని స్పష్టంగా హామీ ఇచ్చామని అచ్చెన్న తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మొదటి ఢిల్లీ పర్యటనలోనే ప్రధాని మోది, కేంద్రమంత్రి కుమారస్వామిలను కలిశారని, ఆ తరువాతే స్టీల్ ప్లాంట్ సందర్శనకు కుమారస్వామి వచ్చారని అచ్చెన్న గుర్తు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు వచ్చిన కుమారస్వామి కార్మికులతో కూడా మాట్లాడారని , ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కార్మికులకు కుమార స్వామి హామీ ఇచ్చారు అనే విషయాన్ని అచ్చెన్న మరోసారి గుర్తు చేశారు.