కొద్ది కాలంలోనే మంచి క్రికెటర్ గా గుర్తింపు పొందాడు శ్రీశాంత్.ఎంత వేగంగా టిమిండియాలోకి వచ్చాడు.అంతే వేగంగా వివాదాస్పద క్రికెటర్ గా గుర్తింపు పొందాడు.తోటి క్రికెటర్ హర్బజన్ సింగ్ తో కొట్లాట సహా పలు గొడవలకు కారణం అయాడు.అటు తన జీవితంలోనే అత్యంత తీవ్ర నేరానికి పాల్పడ్డాడు శ్రీశాంత్.ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధం ఎదుర్కొన్నాడు.
అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చొరవతో ఆ నిషేధ సమయం తగ్గించబడింది. త్వరలోనే మళ్లీ మైదానంలోకి దిగబోతున్నాడు.
అయితే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా శ్రీశాంత్ కు తోడుగా నిలిచింది ఆయన భార్య.ఇంతకీ తన భార్య ఎవరు? ఆమె శ్రీశాంత్ కు ఎలా సహకరించింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీశాంత్ భార్య దివాన్‌పూర్ రాజకుమారి భువనేశ్వరి.2013లో దివాన్‌పూర్ రాజకుమారి అయిన భువనేశ్వరితో శ్రీశాంత్ పెళ్లి ఏర్పాట్లు కొనసాగుతుండగానే అతడిపై బ్యాన్ అనౌన్స్ మెంట్ వచ్చింది.శ్రీశాంత్ తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియలేదు.
ఈ పెళ్లి ఆగిపోవడం ఖాయం అనుకున్నారు. కానీ భువనేశ్వరి పేరెంట్స్ మాత్రం శ్రీశాంత్ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.ఈ పెళ్లి ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
నిజానికి వీరిది ప్రేమ పెళ్లి కాకపోతే కచ్చితంగా ఆగిపోయేది.రాజస్థాన్ రాజ కుటుంబం తమ బిడ్డ ప్రేమే ప్రధానంగా భావించింది.
24 ఏళ్ల వయస్సులో శ్రీశాంత్ రాజస్థాన్‌లో మ్యాచ్ ఆడేందుకు వెళ్లినప్పుడు భువనేశ్వరి పదో తరగతి చదువుతుంది.ఆ మ్యాచ్‌లో శ్రీశాంత్‌ని చూసి ప్రేమలో పడింది.భువనేశ్వరి 15 ఏటనే శ్రీశాంత్‌ను ప్రేమిస్తే శ్రీశాంత్ ఆమెకు 20 ఏండ్లు వచ్చే వరకు ప్రేమిస్తున్నట్లు చెప్పలేదు.అప్పటి వరకు వీరు ఫోన్ లోనే మాట్లాడుకునే వారు.
ప్రతి విషయంలో తను శ్రీశాంత్ కు తోడుగా ఉండేది.హిందీ బిగ్‌బాస్ షో వీకెండ్ లో అతడిని కలిసేందుకు భువనేశ్వరి రావడంతో వారి ప్రేమ బయట పడింది.
అటు క్రికెట్ ప్రపంచం నుంచి విమర్శలు వస్తున్న సమయంలోనూ అండగా నిలిచింది.ప్రస్తుతం వీరిద్దరికి ఇద్దరు పిల్లలు పుటకటారు.
వారిలో కూతురు శాన్విక, కొడుకు సూర్యశ్రీ.