అక్కినేని అమల.తెలుగు రాష్ట్రాల్లో ఆమె గురించి తెలియని వారు ఉండరు.
నాగార్జునతో ప్రేమ వివాహం తర్వాత సినిమా పరిశ్రమ నుంచి బయటకు వచ్చింది.అడపాదడపా చిన్న చిన్న రోల్స్ చేసిందే తప్ప.
లాంగ్ లెన్త్ సినిమాలు చేయలేదు.ఆ తర్వాత బ్లూ క్రాస్ సంస్థను స్థాపించి మూగ జీవుల పరిరక్షణ కోసం పాటుపడుతుంది.
అమల 1986లో సినిమా రంగ ప్రవేశం చేసింది.టి.రాజేందర్ దర్శకత్వంలో వచ్చిన మిథిలి ఎన్నై కాథలి సినిమాతో వెండితెరపై దర్శనం ఇచ్చింది.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
రాత్రి రాత్రే మంచి పాపులారిటీ సంపాదించింది.కేవలం 50 సినిమాలతో జనాలను విపరీతంగా ఆకట్టుకుంది అమల.వీటిలో పలు తమిళ హిట్ సినిమాలున్నాయి.ఉల్లాడక్కం అనే మలయాళ సినిమాలో నటనకు గాను తనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది.
తన భర్త అక్కినేని నాగార్జునతో కలిసి నిర్ణయం, శివ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించింది.ఈ సినిమాలు చేస్తున్న సమయంలోనే ఇద్దరు ప్రేమించుకున్నారు.కానీ అప్పటికే వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని పెళ్లి చేసుకున్నా నాగార్జున.అప్పటికే వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.
దీంతో లక్ష్మి కి విడాకులు ఇచ్చాడు.అనంతరం అమలను పెళ్లి చేసుకున్నాడు.
నాగార్జునను వివాహం చేసుకున్న తరువాత 1992 నుంచి సినిమాలు చేయడం లేదు.20 సంవత్సరాల విరామం తరువాత ఆమె 2012 లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కలిపించింది.ఈ సినిమాకి ఆమెకు ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.అమల నటితో పాటు భరతనాట్యం నర్తకి కూడా.తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో పలు సినిమాలు చేసింది.అటు అమల తండ్రి బెంగాలీ నేవీ ఆఫీసర్ కాగా.
తల్లి ముఖ్రాజీ ఐర్లాండ్ మహిళ.వీరు కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
ప్రస్తుతం అమల హీరో శర్వానంద్ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.