పుష్ప ది రూల్ (Pushpa the Rule)సినిమా టికెట్ రేట్లు కనిష్టంగా 500 రూపాయల నుంచి గరిష్టంగా 3000 రూపాయల వరకు ఉన్నాయి.ఏపీలో టికెట్ రేట్ల పెంపు గురించి క్లారిటీ లేదు కానీ ఇక్కడ కూడా టికెట్ రేట్లు ఒకింత భారీ స్థాయిలోనే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఏపీలో కూడా టికెట్ రేట్లు పెరిగితే మాత్రం ఫ్యాన్స్ బాధ మామూలుగా ఉండదు.అభిమానాన్ని క్యాష్ చేసుకోవడం కోసం టికెట్ రేట్లను భారీగా పెంచేస్తున్నారు.
వాస్తవానికి దేవర(Devara) సినిమా రిలీజ్ సమయంలో బెనిఫిట్ షోల టికెట్ రేట్లు 1000 రూపాయలుగా ఉన్నాయి.అయితే కేవలం ఒక షోకు మాత్రమే టికెట్ రేట్లను పరిమితం చేయడం, అనధికారికంగా ఆ రేటుకు విక్రయించడంతో ఫ్యాన్స్ పెద్దగా బాధ పడలేదు.
ఇప్పుడే టికెట్ రేట్లు ఇలా ఉంటే మహేష్ రాజమౌళి (mahesh rajamouli )కాంబో మూవీ రిలీజ్ సమయానికి టికెట్ రేట్లు 5000 అవుతాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ రేంజ్ లో టికెట్ రేట్లు పెట్టినా సినిమాను చూసేవాళ్లు చూస్తారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఫ్యాన్స్ ఈ రేట్లకు సిద్ధం కావాల్సిందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సినిమా టికెట్ రేట్లకు సంబంధించి నిర్మాతల వెర్షన్ ఒక విధంగా ఉంటే అభిమానుల వెర్షన్ ఇంకో విధంగా ఉంది.
పుష్ప1 (Pushpa-1)రిలీజ్ సమయంలో టికెట్ రేట్ల తగ్గింపుతో చర్చ జరగగా ఇప్పుడు భిన్నమైన చర్చ జరుగుతోంది.
పుష్ప ది రూల్ టికెట్ రేట్లు అత్యాశ వల్ల వచ్చిన టికెట్ రేట్లో లేక సాధారణ టికెట్ రేట్లా అనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఫస్ట్ వీకెండ్ వరకు పుష్ప ది రూల్ కలెక్షన్లకు ఢోకా లేకపోయినా ఆ తర్వాత మాత్రం ఇబ్బందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పుష్ప ది రూల్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.