ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి , జనసేన, బిజెపిలు( TDP, Janasena, BJP ) అన్ని విషయాలపై ఒక క్లారిటీతో ముందుకు వెళుతున్నాయి.ముఖ్యంగా ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు సంబంధించి మూడు పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చాయి.
ముందుగా టిడిపి, జనసేన, బిజెపిలు ఈ మూడు స్థానాలను పంచుకుంటాయని ప్రచారం జరిగింది.జనసేన తరఫున పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు రాజ్యసభ సభ్యత్వం దక్కబోతుందని, ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
వైసిపి కి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు పదవికి , పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో, ఈ మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి.అసెంబ్లీలో కూటమికి పూర్తి బలం ఉండడంతో , మూడు స్థానాలు కూడా కూటమి పార్టీలకి దక్కనున్నాయి.
దీంతో జనసేన, బిజెపి, టిడిపి లు మూడు స్థానాలను పంచుకుంటాయని ప్రచారం జరిగింది.కానీ దానికి భిన్నంగా ఎంపికలు జరిగినట్లు సమాచారం.ఏపి నుంచి రాజ్యసభకు వెళ్లే వారి పేర్లను దాదాపు ఫైనల్ చేసినట్లు సమాచారం.ప్రస్తుతం ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు( Rajya Sabha seats ) రాజీనామా చేసిన ముగ్గురు బీసీ నేతలే కావడంతో , ఆ స్థానాల్లో బీసీలకు అవకాశం ఇవ్వాలని వేరొకరికి అవకాశం ఇవ్వడం ద్వారా విమర్శలు వచ్చే అవకాశం ఉందనే చర్చ జరగడంతో పాటు, వైసిపి నుంచి టిడిపిలో చేరిన వారికి ఇచ్చిన హామీ మేరకు వారికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలనే ఆలోచనలు చంద్రబాబు ఉన్నారట.
జనసేన నుంచి రాజ్యసభకు నాగబాబుకు( Naga Babu ) అవకాశం దకడం లేదట.పవన్ ఇటీవల ఢిల్లీ పర్యటనలోనూ నాగబాబును రాజ్యసభకు పంపాలని అంశంపై కేంద్ర బిజెపి పెద్దలతో చర్చలు జరిగినట్లుగా ప్రచారం జరిగింది.బిజెపి అగ్ర నేతలు మాత్రం ఏపీ నుంచి ఎంపిక చేసే మూడు స్థానాల్లో ఒక స్థానం తమ పార్టీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య ను తిరిగి నామినేట్ చేయాలని నిర్ణయించారు .ఆ హామీ మేరకు టిడిపి మళ్లీ ఆయనకే ఆ పదవి ఇవ్వబోతుందట.మిగిలిన ఇంకో స్థానం నుంచి ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
టిడిపి నుంచి రాజ్యసభ సభ్యత్వం కోసం పోటీపడుతున్న నేతలు చాలామంది ఉన్నారు.వీరిలో సీనియర్ నేతలు.
కంభంపాటి రామ్మోహన్ రావు , భాష్యం రామకృష్ణ , గల్లా జయదేవ్, వర్ల రామయ్య , సామ సతీష్ పేర్లు వినిపిస్తున్నాయి.