అజీర్తి.అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే జీర్ణ సమస్యల్లో(digestive problems) ఒకటి.
ఎప్పుడో ఒకసారి అజీర్తి చేసిందంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.కానీ కొందరు ప్రతినిత్యం అజీర్తిని అనుభవిస్తారు.
అతిగా తినడం, అతి వేగంగా తినడం, స్పైసీ ఫుడ్స్ మరియు అధిక ఫైబర్ ఆహారాలను ఓవర్ గా తీసుకోవడం, మద్యపానం, కెఫిన్ పానీయాలు, చాక్లెట్ లేదా కార్బోనేటేడ్ పానీయాలు తాగడం, ఒత్తిడి, అధిక బరువు, ప్రెగ్నెన్సీ, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల అజీర్తి ఇబ్బంది పెడుతుంటుంది.దీనివల్ల ఏమైనా తినాలంటేనే భయపడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.
అజీర్తికి(indigestion) చెక్ పెట్టే ఔషధాలు మన వంటింట్లో ఎన్నో ఉన్నాయి.అందులో అల్లం ఒకటి.అల్లంలో ఉండే జింజెరాల్ (ginger)జీర్ణ క్రియను వేగవంతం చేస్తుంది.ఒక గ్లాస్ వాటర్ లో వన్ టీ స్పూన్ అల్లం తురుము వేసి మరిగించి ఆ నీటిని తాగితే అజీర్తి, దాని వల్ల వచ్చే కడుపు ఉబ్బరం(Abdominal bloating) రెండూ పరారవుతాయి.
అలాగే అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం(Indigestion, gas, bloating) మరియు మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుండి తక్షణ ఉపశమనాన్ని అందించడంలో సోంపు (Anise)చాలా అద్భుతంగా తోడ్పడుతుంది.వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలను కచ్చాపచ్చాగా దంచి ఒక గ్లాస్ వాటర్ లో పది నిమిషాల పాటు మరిగించి తీసుకోవాలి.ఈ సోంపు వాటర్ ఆహారం త్వరగా అరిగేందుకు సహకరిస్తుంది.అజీర్తి కి బై బై చెప్పేందుకు సహాయపడుతుంది.
ఫుడ్ అరగక అజీర్తితో ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక టీ స్పూన్ వాములో(Ajwain) చిటికెడు ఉప్పు కలిపి మెత్తగా నలిపి తినాలి.ఆపై ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని సేవించాలి.ఇలా చేసిన కూడా మంచి రిలీఫ్ పొందుతారు.ఇక తరచూ అజీర్తి ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే నిత్యం అరగంట పాటు వ్యాయామం చేయండి.భోజనం తర్వాత పది నిమిషాలు వాకింగ్ చేయండి.వేళకు ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి.
మద్యపానం మానుకోండి.స్పైసీ ఫుడ్స్, కాఫీ, కూల్ డ్రింక్స్ ను అవాయిడ్ చేయండి.
ఒత్తిడికి దూరంగా ఉండండి.శరీర బరువును అదుపులో ఉంచుకోండి.