న్యూస్ రౌండప్ టాప్ 20

1.టీఎస్ సెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు

Telugu Brs, Congress, Cpi Yana, Etela Rajender, Jagan, Kumaraswamy, Patnammahend

తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష  (టి ఎస్ సెట్ )( Ts Cets ) కు దరఖాస్తు గడువును పొడిగించారు.ఆగస్టు 29 తో ఈ గడువు ఉండగా,  దానిని సెప్టెంబర్ 4 వరకు పొడిగించినట్లు సెట్ కార్యదర్శి ప్రొఫెసర్ మురళీకృష్ణ వెల్లడించారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Brs Party,-TeluguStop.com

2.ఉపాధ్యాయ సంఘాల హెచ్చరిక

జిపిఎస్ కు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు ఏకమవుతున్నాయి.విజయవాడ యూటీఎఫ్ కార్యాలయంలో యుటిఎఫ్ ,ఎస్టీయూ ,ఏపీటీఎఫ్ నేతలు సమావేశం అయ్యారు.

3.సిపిఐ నారాయణ కామెంట్స్

Telugu Brs, Congress, Cpi Yana, Etela Rajender, Jagan, Kumaraswamy, Patnammahend

పొత్తులపై టిడిపి ఊగిసలాట వీడాలని సిపిఐ నేత నారాయణ( CPI Narayana ) కోరారు.

4.నారా భువనేశ్వరి కామెంట్స్

ప్రజల కోసం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara lokesh ) పోరాడుతున్నాడని, లోకేష్ తల్లి,  చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.

5.ప్రధానికి రాఖీ కట్టిన చిన్నారులు

Telugu Brs, Congress, Cpi Yana, Etela Rajender, Jagan, Kumaraswamy, Patnammahend

స్కూల్ విద్యార్థునులతో కలిసి ప్రధాని నరేంద్ర మోది( PM Modi ) రక్షాబంధన్ వేడుకను చేసుకున్నారు.ఢిల్లీ పాఠశాలల విద్యార్థులు ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు.

6.కిషన్ రెడ్డి విమర్శలు

భూములు అమ్మితే తప్ప తెలంగాణ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని,  కేంద్రమంత్రి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.

7.మాజీ సీఎంకు అస్వస్థత

Telugu Brs, Congress, Cpi Yana, Etela Rajender, Jagan, Kumaraswamy, Patnammahend

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ పార్టీ ముఖ్య నేత కుమారస్వామి అస్వస్థత( Kumaraswamy )కు గురవడంతో ఆయనను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

8.ఏనుగు బీభత్సం దంపతులు మృతి

చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది.  చిత్తూరు జిల్లా గుడిపాల మండలం 190 – రామాపురం గ్రామంలో బుధవారం ఏనుగు దాడిలో దంపతులు మృతి చెందారు.

9.మంత్రిగా ప్రమాణ స్వీకారం

Telugu Brs, Congress, Cpi Yana, Etela Rajender, Jagan, Kumaraswamy, Patnammahend

రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, ఘనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి( Patnam Mahender Reddy ) ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు.

10.లక్ష్మీపార్వతి విమర్శలు

ఎన్టీఆర్ కు భారతరత్న విషయం పక్కకు తప్పించారని ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ఆరోపించారు.చంద్రబాబు పురందేశ్వరి కలిసి ఎన్టీఆర్ కు మరోసారి వెన్నుపోటు పొడిచారని లక్ష్మీపార్వతి విమర్శించారు.

11.ప్రధానిపై రాహుల్ విమర్శలు

Telugu Brs, Congress, Cpi Yana, Etela Rajender, Jagan, Kumaraswamy, Patnammahend

చైనా భారత్ సరిహద్దు వివాదానికి సంబంధించి కాంగ్రెస్ ముఖ్య నేత ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోది పై విమర్శలు చేశారు.

12.డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు

సెప్టెంబర్ 2న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ గృహప్రవేశానికి సెప్టెంబర్ 2 ముహర్తంగా నిర్ణయించారు .

13.తెలంగాణ అర్చకుల జీతాల పెంపు

తెలంగాణ ప్రభుత్వం అర్చకులకు శుభవార్త చెప్పింది.ధూప , దీప నైవేద్య పథకం కింద అర్చకులకు గౌరవ వేతనం 6000 నుంచి మీకు పెంచుతూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.

14.పీజీ ప్రవేశాల కౌన్సిలింగ్

సెప్టెంబర్ 5 నుంచి పీజీ ప్రవేశాల కౌన్సిలింగ్ జరగనుంది.సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి.

15.జగన్ కు రాఖీ కట్టిన మహిళా మంత్రులు

రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏపీ సీఎం జగన్ కు మహిళా మంత్రులు తానేటి వనిత, విడదల రజనీ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

16.టీటీడీకి హైకోర్టు ఆదేశం

భక్తుల రక్షణ కోసం ఏ చర్యలు తీసుకున్నారో మూడు వారాల్లో గా  చెప్పాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఏపీ హైకోర్టు ఆదేశించింది.

17.జగన్ రాఖీ శుభాకాంక్షలు

Telugu Brs, Congress, Cpi Yana, Etela Rajender, Jagan, Kumaraswamy, Patnammahend

ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అని ఏపీ సీఎం జగన్ అన్నారు.

18.కెసిఆర్ పై ఈటెల కామెంట్స్

Telugu Brs, Congress, Cpi Yana, Etela Rajender, Jagan, Kumaraswamy, Patnammahend

గజ్వేల్ నుంచి ఓడిపోతానని భయంతో కామారెడ్డికి కేసీఆర్ వెళ్లిపోయారని బిజెపి నేత ఈటెల రాజేందర్( Etela Rajender ) విమర్శించారు.

19.అమరావతి భూములపై తీర్పు రిజర్వడ్

అమరావతి భూములపై సిఐడి కేసులపై హైకోర్టు తీర్పు రిజర్వ్ డ్ చేసింది.

20.బండి సంజయ్ కామెంట్స్

తెలంగాణలో గెలిచేది బిజెపి మాత్రమే అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube