ఇటీవల, విదేశీ దేశాల నుంచి వచ్చిన ఫుడ్ బ్లాగర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు( Food bloggers and influencers ) భారతీయ ఆహారాలను రుచి చూసి, వాటిపై తమ అభిప్రాయాలను వీడియోల్లో పంచుకోవడం ఫేమస్ అయిపోయింది.వీళ్లు మన ఆహారాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఈ క్రమంలోనే, పుణెలో ఉంటున్న కొరియన్ కంటెంట్ క్రియేటర్ కెల్లీ కొరియా( Kelly Correa ), ఇండియన్ ఫేమస్ స్వీట్‌గా పేరున్న గులాబ్ జామూన్‌ను రుచి చూసి, దాని గురించి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియో పోస్ట్ చేసింది.ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.
భారతీయులు వివాహాలు, పండుగలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో గులాబ్ జామూన్ ( Gulab Jamun )తప్పకుండా తయారు చేస్తుంటారు.
కెల్లీ కొరియా గులాబ్ జామూన్ రుచికి మైమరిచిపోయింది.వైరల్ వీడియోలో కెల్లీ గులాబ్ జామూన్ బౌల్‌ను చేతిలో పట్టుకుని, దాని పరిమాణం చూసి ఆశ్చర్యపోతుంది.దాన్ని ఎలా తినాలో తెలియక చుట్టుపక్కల వారిని అడుగుతుంది.
వారు దాన్ని చెంచాతో రెండు ముక్కలుగా కట్ చేసి తినమని సలహా ఇస్తారు.కెల్లీ చిన్న ముక్కను తీసుకుని తిని, “ఇది చాలా వెచ్చగా, మృదువుగా, క్రీమీగా ఉంది” అని చెప్పింది.
మరొక ముక్క తిన్న తర్వాత, “వావ్! ఇది నాకు చాలా నచ్చింది.ఇది ఇండియన్ స్వీట్ అని చెప్పారా? నాకు నచ్చేసింది” అని ఆనందంగా చెప్పింది.
కెల్లీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో “నాకు గులాబ్ జామూన్ చాలా ఇష్టం” అని రాసింది.కెల్లీ గులాబ్ జామూన్‌ను ఆనందంగా తింటున్న వీడియో చూసి నెటిజన్లు హ్యాపీగా ఫీల్ అయ్యారు.చాలామంది ఆమె రియాక్షన్‌ను ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు.ఒక యూజర్, “కెల్లీ చాలా అమాయకంగా, ఆమెను చూడటం చాలా ఆనందంగా ఉంటుంది” అని కామెంట్ చేసింది.మరొకరు, “భారతీయులు ప్రేమతో ఆహారం తయారు చేస్తారు, అది వంటలో స్పష్టంగా కనిపిస్తుంది.” అని రాశారు.కెల్లీ ఇండియన్ ఫుడ్ గురించి వీడియో చేయడం ఇదే తొలిసారి కాదు.ఇంతకుముందు వడపావ్, జిలేబి తిని ఆమె ఫిదా అయిపోయింది.ఆ రియాక్షన్ వీడియోలు కూడా ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో చూడవచ్చు.