నేటి కాలంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా.చాలా మంది ల్యాప్‌టాప్‌ను యూజ్ చేస్తున్నారు.
పెద్దలు ఆఫీస్ వర్క్ కోసం ల్యాప్‌టాప్ యూజ్ చేస్తే.పిల్లలు గేమ్స్ ఆడేందుకు, సినిమాలు చూసేందుకు ఇలా రకరకాల అవసరాల కోసం ల్యాప్‌టాప్‌ను వినియోగిస్తున్నారు.
అయితే వేటి కోసం వాడినా.ల్యాప్‌టాప్ తో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఎందుకంటే,ల్యాప్‌టాప్ యూజ్ చేసే సమయంలో.చాలా మంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు.
అయితే చిన్న చిన్న పొరపాట్ల వల్లే అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది.అవేంటో ఓ లుక్కేసేయండి.
సాధారణంగా కొందరు ల్యాప్‌టాప్ ముందు కూర్చున్నారు అంటే.గంటలు తరబడి దాని ముందే ఉంటారు.
కనీసం పైకి లెగాలన్న ఆలోచన కూడా ఉండదు.అయితే అలా చేయడం వల్ల కండరాలు పట్టేయడం, మెడ నొప్పి, నడుము నొప్పి, రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వట్టి సమస్యలు తలెత్తుతాయి.
అందుకే ల్యాప్‌టాప్ యూజ్ చేసే సమయంలో.గంటకు ఒకసారి ఖచ్చితంగా పైకి లేచి అటు, ఇటు తిరగాలంటున్నారు నిపుణులు.
ఇక చాలా మంది కామన్‌గా చేసే పొరపాటు.ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని యూజ్ చేయడం.
అయితే స్త్రీలు అయినా.పురుషులు అయినా ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకుడదు.
ఎందుకుంటే, ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకొని యూజ్ చేయడం వల్ల తొడ భాగంలో చర్మం ఇన్ఫెక్షన్ వస్తుంటుంది.ఇక కొందరిలో ఇది చర్మ క్యాన్సర్‌కి దారి తీసే రిస్క్ కూడా ఉంది.
అంతేకాదు, ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టికుని వర్క్ చేయడం వల్ల.ఉష్ణోగ్రత వెలువడుతుంది.
ఆ ఉష్ణోగ్రత వల్ల పురుషుల్లో వీర్య కణాల నాణ్యత తగ్గిపోయి.సంతాన సమస్యలకు దారి తీస్తుంది.
ఇక కొందరు ల్యాప్‌టాప్ యూజ్ చేసే సమయంలో.స్క్రీన్ కు చాలా దగ్గరగా కళ్లు పెట్టి చూస్తుంటారు.
కానీ, ఇలా చేయడం వల్ల కంటిలోని రెటీనా సామర్థ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.తద్వారా కంటి సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.
అందుకే ల్యాప్‌టాప్ యూజ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు నిపుణులు.